రీల్స్ చేస్తూ చనిపోయిన చిన్నారి
సంగారెడ్డి జిల్లాలో దారుణం;
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు రాత్రికి రాత్రి స్టార్ అయిపోవచ్చు అనే ఆరాటం పోరాటం ఎక్కువైంది. చాలా మంది వివిధ రకాల వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. కానీ అదే రీల్స్ పిచ్చి ఇప్పుడు పీక్స్ కు చేరింది. కేవలం యువత మాత్రమే కాదు, చిన్న పిల్లలు సైతం రీల్స్ ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్నారు. అందులో కొందరు డేంజరస్ విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కొల్పోతున్నారు. మరికొందరు కన్నవారికి కంఠశోష మిగులుస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన రీల్స్ చేస్తూ చిన్నారి సహస్ర చనిపోయింది. పటాన్ చెరు మండలం చిట్కుల్ కు చెందిన ఈ చిన్నారీ రీల్స్ చేయాలనుకుంది. ఫ్యానుకు ఉరి వేసుకుంటున్నట్లు రీల్స్ చేసే ప్రయత్నం చేసింది. ఇలా చేయడం వల్ల లైకులు పెరుగుతాయనుకుంది. ఫ్యాను కు తాడు కట్టింది. మెడకు తాడు బిగించుకుంది. సడెన్ గా కరెంటు రావడంతో తాడు మెడకు చుట్టుకుని గిరగిరా తిరగడంతో సహస్ర గొంతు బిగుంచుకుపోయి ఊపిరాడక చనిపోయింది. రియల్ లైఫ్ లో రీల్స్ ఎంత్ర ప్రమాదమో ఈ ఘటన రుజువు చేసింది.