సూర్యాపేట జిల్లాలో అమానుషం

మద్యం మత్తులో 12 నెలల పసికందును నేలకేసి కొట్టిన తండ్రి

Update: 2025-09-20 09:01 GMT

సూర్యాపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడేలా మద్యం మత్తులో ఓ తండ్రి తన ఏడాది బిడ్డను బండకేసి కొట్టి హత్య చేశాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంకకాలనీలో చోటు చేసుకున్న శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మద్యం సేవించి ఇంటికి వచ్చిన వెంకటేశ్ ను భార్య మందలిస్తుండగా ఏడాది వయసున్న కూతురు( భవి) బిగ్గరగా ఏడ్చింది. పేగు బంధాన్ని కూడా మరచిన ఆ తండ్రి 12 నెలల పసికందును నేలకేసి కొట్టాడు. బిడ్డ రెండు కాళ్లు పట్టుకుని గిరగిరా తిప్పుతూ నేలకేసి కొట్టడంతో తలకు తీవ్ర రక్తస్రావమైంది. బిడ్డ అపస్మారక స్థితిలో చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్నబిడ్డ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.బిడ్డ చనిపోయిన విషయం తెలియగానే వెంకటేశ్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు వెంకటేశ్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పసికందు చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు.

Tags:    

Similar News