గల్ఫ్ వెళ్లేవారు మోసపోకుండా మంచి అవకాశం

గల్ఫ్ వెళ్లేవారు మోసపోకుండా ఉండేందుకు ముందే అక్కడి పరిస్థుతలపై, విదేశాలకు వెళ్ళాక ఎలా మెలగాలి? పాస్ పోర్ట్ ఎలా కాపాడుకోవాలి?

Update: 2024-08-08 15:14 GMT

గల్ఫ్ వెళ్లేవారు తరచూ ఏజెంట్ల చేతిలో మోసపోయిన దేశం కాని దేశంలో నరకం చూస్తున్నారు. ఇలాంటి వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. అలా మోసపోకుండా ఉండేందుకు ముందే అక్కడి పరిస్థుతలపై, విదేశాలకు వెళ్ళాక ఎలా మెలగాలి? పాస్ పోర్ట్ ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి అంశాలపై శిక్షణ ఉంటే చాలామందికి మేలు జరుగుతుంది కదా. మరి అలాంటి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయా అంటే ఉంది. అదే తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ అనుబంధ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ లిమిటెడ్ (టాంకాం) సంస్థ. ఇది హైదరాబాద్ లోని మాసాబ్ టాంక్ మల్లేపల్లి ఐటీఐ ఆవరణలో ఉంది. ఈ సంస్థ గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లేవారికి ఒకరోజు ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (పిడిఓటి) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 

ఏయే అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు?

ప్రవాసీ కౌశల్‌ వికాస్‌ యోజన పథకంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఆయా దేశాల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనలు తెలియజేస్తూ వలస వెళ్లే కార్మికుల విశిష్ట నైపుణ్యాలు (సాఫ్ట్‌ స్కిల్స్‌) పెంపొందించుట ఈ శిక్షణ ఉద్దేశమని ట్రైనర్ బిఎల్ సురేంద్రనాథ్ తెలుపారు. 

రిక్రూట్మెంటు నుండి గల్ఫ్‌లో ఉద్యోగంలో చేరేంత వరకు వివిధ దశల్లో ఎలా మెలగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శిక్షణలో తెలుపుతున్నారు. గల్ఫ్‌ దేశాలలో చట్టాలు, వాటిని అతిక్రమిస్తే వారు వేసే శిక్షలను తెలుపుతున్నారు. ఇంతే కాకుండా ఏ రంగంలో పని చేస్తే ఎంత జీతం వస్తుంది, దానిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేసిన డబ్బును కుటుంబ సభ్యులకు ఎలా చేరవేయాలి తదితర విషయాలను వివరిస్తున్నారు. 

ట్రైనింగ్ కోసం ఎలా అప్లై చేయాలి?

ఈ సంస్థ ముఖ్యంగా గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లే కార్మికులకు సాఫ్ట్ స్కిల్స్ పైన టర్నింగ్ ఇస్తున్నారు. వీసా, పాస్ పోర్ట్ పనులన్నీ కంప్లీట్ అయి ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారు ట్రైనింగ్ కి అప్లై చేసుకోవచ్చు. https://tomcom.telangana.gov.in/ వెబ్సైట్ లో ఆన్లైన్ రిజిస్టర్ కేటగిరిని ఎంపిక చేసుకుని అక్కడ వివరాలన్నీ ఇచ్చి ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వారంలో మూడు రోజులు శిక్షణ తరగతులు నడుస్తాయి. ఈ మూడు రోజుల్లో అనుకూలంగా ఉన్న రోజును సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న రోజు సంస్థ తెలిపిన సమయానికి శిక్షణ కేంద్రానికి వెళ్లి ఒక్కరోజు ట్రైనింగ్ లో పాల్గొనవచ్చు. ట్రైనింగ్ పూర్తయిన వారికి టాంకాం సంస్థ సర్టిఫికెట్ కూడా ఇస్తుందని వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి తెలిపారు.


పరిశీలించిన ప్రవాసి సంఘాల ప్రతినిధుల బృందం

సంస్థలో శిక్షణా తరగతులను ప్రవాసి సంఘాల ప్రతినిధుల బృందం ఇటీవల పరిశీలించింది. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ ఇండియన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ నాయకత్వంలో వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, కువైట్ ఎన్నారై కల్యాణి చొప్పల, అబుదాబి ఎన్నారై ప్రియా సింగిరెడ్డి లు 'టాంకాం' ను సందర్శించారు. 'టాంకాం' జనరల్ మేనేజర్ కె. నాగభారతి, మేనేజర్ ఎస్. షబ్న, ఐటీఐ ట్రేనింగ్ ఆఫీసర్ ఎం.బి. క్రిష్ణ యాదవ్ లు 'టాంకాం' కార్యకలాపాలు, శిక్షణ గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. 

Tags:    

Similar News