పోలీసు అమరవీరుల పిల్లలకు శుభవార్త

పోలీసు, ఇతర యూనిఫాం సర్వీసులో అమరులకు తెలంగాణ సర్కారు సోమవారం శుభవార్త వెల్లడించింది. పోలీస్ అమరవీరుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించనున్నారు.

Update: 2024-10-21 12:34 GMT

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు అమరవీరుల పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రపంచ స్థాయి రెసిడెన్షియల్ విద్యా సంస్థను స్థాపించడానికి రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం జీఓఎంఎస్ నంబరు 72 తో ఉత్తర్వులను రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ రవి గుప్తా వెలువరించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ పోలీసు స్కూలు ప్రారంభం కానుంది. సోమవారం పోలీసు అమరవీరుల పిల్లలను సీఎం కలిశారు.


యంగ్ ఇండియా పోలీస్ స్కూలు
మౌలిక సదుపాయాలు,వసతి సౌకర్యాలు,క్రీడా సముదాయంతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పేరుతో కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.యంగ్ ఇండియా పోలీస్ స్కూలులో పోలీసు సిబ్బందికి చెందిన సిబ్బంది పిల్లలకు సేవలందించాలని హోం సెక్రటరీ ప్రతిపాదించారు. పోలీసు అమరవీరుల పిల్లలే కాకుండా ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాలైన ఫైర్, ఎక్సైజ్, ఎస్ పీఎఫ్, జైళ్ల ఉద్యోగుల పిల్లలకు ఈ స్కూలులో అడ్మిషన్లు కల్పించాలని నిర్నయించారు.

డీజీపీ పర్యవేక్షణలో...
ప్రజలకు సేవ చేసే యూనిఫాం సర్వీసుల ఉద్యోగుల పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సౌకర్యాలతో పోలీసు స్కూలును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పోలీసు స్కూలు ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ డీజీపీ జితేందర్ పర్యవేక్షించనున్నారు.


Tags:    

Similar News