టీబీ సీల్ విక్రయ ప్రచారానికి గవర్నర్ శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం రాజ్ భవన్ లో టీబీ సీల్ విక్రయ ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణ నుంచి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని గవర్నర్ వైద్యులను కోరారు.

Update: 2024-10-16 14:44 GMT

2025వ సంవత్సరం నాటికి టీబీ రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు వైద్యులందరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీబీని నిర్మూలించాలని ఆయన సూచించారు. బుధవారం రాజ్ భవన్ లోని దర్బారు హాలులో టీబీ అసోసియేషన్ వైద్యులతో కలిసి టీబీ సీల్ విక్రయ ప్రచారాన్ని గవర్నర్ ప్రారంభించారు. క్షయవ్యాధి పూర్తిగా నయమయ్యేలా వైద్యులందరూ సంఘటిత ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ టీబీ అసోసియేషన్ ను గవర్నర్ అభినందించారు.


టీబీ అసోసియేషన్ కొత్త కార్యవర్గం
టీబీ అసోసియేషన్ కార్యక్రమానికి డాక్టర్ టి.వి.వెంకటేశ్వరులు అధ్యక్షత వహించారు. డాక్టర్ సుధీర్ ప్రసాద్‌తో టీబీ అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.టీబీ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా డా.సి.ఎన్.ప్రసాద్, డా.బాలచందర్ ప్రధాన కార్యదర్శిగా మరో 15 మంది సభ్యులుగా ఎన్నికయ్యారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులతో గవర్నర్ భేటి
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులతో మాట్లాడారు. దేశాభివృద్ధి, ఉపాధి కల్పన, స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేయాలని గవర్నర్ సూచించారు. సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ అని మోదీ నినాదంతో ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి సాధించాలని గవర్నర్ కోరారు. సామాజిక అభివృద్ధి కోసం ప్రభుత్వ రంగ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనాథలను ఆదుకోవాల్సిన ఆవశ్యకతను గవర్నర్ ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం,అజయ్ మిశ్రా, సీనియర్ రాజ్ భవన్ అధికారులు;సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అధిపతులు పాల్గొన్నారు.


Tags:    

Similar News