కొత్త వీసీలతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కీలక భేటీ
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో భేటీ అయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలని గవర్నర్ వీసీలకు సూచించారు.
By : The Federal
Update: 2024-10-23 15:02 GMT
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం యూనివర్శిటీల కొత్త వీసీలతో ఇంటరాక్టివ్ నిర్వహించారు.వివిధ విశ్వవిద్యాలయాలకు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లతో సమావేశమై వారికి దిశ నిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.గవర్నర్ వైస్ ఛాన్సలర్‌లను కెప్టెన్‌లుగా పేర్కొన్నారు.ఉన్నత విద్య భవిష్యత్తును రూపొందించడంలో వారి కీలక పాత్రను గవర్నర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన కోరారు. విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేయాలని గవర్నర్ సూచించారు.
ఇక నుంచి మూడు నెలలకు ఓ సారి సమీక్ష
ఇక నుంచి వీసీలతో మూడు నెలలకు ఓ సారి సమీక్ష సమావేశాలు ఉంటాయని గవర్నర్ చెప్పారు.విద్యా పురోగతి, విజయాలను సమీక్షించడానికి అన్ని వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సమావేశాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయాలు నిరంతర అభివృద్ధికి భరోసా అని గవర్నర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు బుర్రా వెంకటేశం,జె.భవానీ శంకర్, గవర్నర్ జాయింట్ సెక్రటరీ, రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు