సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్..

సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి రోజువారీ అటెండెన్స్ తీసుకునే పద్దతి మార్చాలని నిశ్చయించుకుంది.

Update: 2024-12-11 12:27 GMT

సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి రోజువారీ అటెండెన్స్ తీసుకునే పద్దతి మార్చాలని నిశ్చయించుకుంది. ఇందుకోసం సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు ప్రతి ఒక్కరి అటెండెన్స్‌ను కూడా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నోట్ చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ పద్దతి గురువారం నుంచి అంటే డిసెంబర్ 20 నుంచి అమలు కానుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ మేరకు జీఓను విడుదల చేశారు. సచివాలయంలో పనిచేసే ప్రతి శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఈ పద్దతి వర్తిస్తుందని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత సదరు డిపార్ట్‌మెంట్ హెడ్స్‌దేనని వివరించారు.

‘‘12-12-2024 నుంచి సచివాలయంలోని అన్ని శాఖ ఉద్యోగులు, సిబ్బంది రోజువారీ అంటెడెన్స్‌ను.. సెక్రటేరియట్ హెడ్స్ ఖాతాల నుంచి పేమెంట్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరి అటెండెన్స్ కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా జరగనుంది. ప్రతి ఉద్యోగి, సిబ్బంది కూడా సెక్రటేరియట్‌లో వచ్చే ముందు, బయటకు వెళ్లే సమయాల్లో తప్పకుండా ఈ పరికరాల్లో తమ అటెండెన్స్ వేయాలి. సెక్రటేరియట్‌లోని ఏ ప్రవేశ ద్వారం దగ్గరైనా అటెండెన్స్ వేసుకోవచ్చు. ఉదయం వచ్చే సమయంలో, సాయంత్రం వెళ్లే సమయంలో తప్పకుండా అటెండెన్స్ వేయాలి. అటెండెన్స్ వేసే సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే అక్కడే ఉండే సిబ్బందిని సంప్రదించాలి. ఎవరూ లేని పక్షంలో ప్రవీణ్ కుమార్ - 817923111, 9704070011, సరితా- 9676621156ను వాట్సాప్, ఫోన్‌కాల్, మెసేజ్ ద్వారా సంప్రదించాలి. వారు తక్షణమే సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ఈ విషయాన్ని ప్రతి శాఖాధికారి కూడా తమ ఉద్యోగులకు, సిబ్బందికి తెలిజేయాలి. దీంతో పాటుగా ప్రతి శాఖలోని పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ 13 వరకు తమ ఫిజికల్ అటెండెన్స్‌ను మెయింటెయిన్ చేయాలి’’ అని సీఎస్ జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్నాయి.

Tags:    

Similar News