అసెంబ్లీలో కేటీఆర్ కు సీన్ రివర్సయ్యిందా ?

గుడ్డకాల్చి ప్రభుత్వం మీదకు విసిరేయటం కాకుండా ఆధారులుంటే చూపించాలని భట్టి సవాలుచేశారు;

Update: 2025-03-26 07:19 GMT
KTR in T Assembly

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం పెద్ద రగడే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్ల వ్యవహారం నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇదే ఆరోపణలను కేటీఆర్ చాలారోజులుగా అసెంబ్లీ బయటచేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా 30 శాతం కమీషన్ల మీదే నడుస్తోందని కేటీఆర్(KTR) పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. అదే విషయాన్ని ఈరోజు(Telangana Assembly) అసెంబ్లీ సమావేశాల్లో కూడా రిపీట్ చేశారు. తమప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేతలే చెబుతున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతున్నపుడు కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దాంతో కేటీఆర్ ను భట్టి గట్టిగా తగులుకున్నారు.

తమ ప్రభుత్వంలోని ఏ శాఖల్లో 30 శాతం కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారు ? కమీషన్లు ఇవ్వకపోతే ఇబ్బందిపెడుతున్న అధికారులు ఎవరో చెప్పాలని కేటీఆర్ ను భట్టి నిలదీశారు. భట్టి అడిగిన జవాబులు చెప్పకుండా కేటీఆర్ మళ్ళీ తన ఆరోపణలను రిపీట్ చేయటంతో సభలో గందరగోళం జరిగింది. గుడ్డకాల్చి ప్రభుత్వం మీదకు విసిరేయటం కాకుండా ఆధారులుంటే చూపించాలని భట్టి సవాలుచేశారు. అయినా కేటీఆర్ తన ఆరోపణలకు ఆధారాలను చూపించలేదు. నిండుఅసెంబ్లీలోనే ఆధారాలను ఇవ్వాలని భట్టి చాలెంజ్ చేసినా కేటీఆర్ పట్టించుకోకుండా అవే ఆరోపణలను రిపీట్ చేయటంతో కాంగ్రెస్ ఎంఎల్ఏలు గొడవకు దిగారు. కేసీఆర్(KCR) పదేళ్ళ పాలనలో జరిగిన కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతిని ప్రస్తావిస్తు ఎదురుదాడులకు దిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గరనుండి కేటీఆర్, హరీష్ ఒక పద్దతిప్రకారం అవినీతి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30 శాతం కమీషన్ల ప్రభుత్వం అని కేటీఆర్ చాలాసార్లు పార్టీ, మీడియా సమావేశాలతో పాటు బహిరంగసభల్లో కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. తన ఆరోపణలకు ఆధారాలు లేవని కేటీఆర్ కు బాగా తెలిసినా పదేపదే ఆరోపణలు చేసి తమ మీడియాతో పాటు తమ సోషల్ మీడియాలో ప్రతిరోజు పదేపదే చూపిస్తుంటే జనాలు నమ్ముతారని అనుకున్నట్లున్నారు. అదేపద్దతిలో 30 శాతం కమీషన్లంటు అసెంబ్లీలో కూడా ఆరోపణలుచేయటంతో సీన్ రివర్సయ్యింది. ఏ శాఖలో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారో చెప్పాలని, తీసుకుంటున్న అధికారులు ఎవరో అసెంబ్లీలో చెప్పాలని భట్టి సవాలుచేసినా కేటీఆర్ చెప్పలేదు.

నిజంగానే తానుచేస్తున్న ఆరోపణలకు ఆధారాలుంటే బయటచూపించకపోయినా అసెంబ్లీ అయినా చూపించేవారే. ఆధారాలను చూపించమని భట్టి పదేపదే అడిగినా చూపలేదంటే కేటీఆర్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. ఆధారాలు లేకుండానే 30 శాతం కమీషన్లంటు పదేపదే కేటీఆర్ ఆరోపణలపై అసెంబ్లీలో పెద్ద రగడే జరిగింది. మొత్తానికి ఇంతకాలంగా కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీలో భట్టి చెక్ పెట్టించగలిగారు.

Tags:    

Similar News