హైదరాబాద్ లో నెదర్లాండ్స్ బీర్ కంపెనీ భారీ పెట్టుబడి

రు. 3 కోట్లు వెచ్చించి ఒక జిసిసి పెట్టాలనుకుంటున్న హైనకన్ (Heineken) కంపెనీ;

Update: 2025-06-18 03:35 GMT

ప్రపంచంలో పేరు మోసిన బీర్ (బీర్)తయారీ కంపెనీలలో ఒకటైన హైనకన్ ఎన్ వి (Heineken)కంపెనీ హైదరాబాద్ లో కాలుమోపాలనుకుంటున్నది. నెదర్లాండ్స్ కు చెందిన ఈ బీర్ కంపెనీ హైదరాబాద్ లో క్రమంగా రు. 3000 కోట్ల పెట్టుబడి పెట్టేయోచన లో ఉంది.  ఇదే జరిగితే ఏసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే మొదటి  గ్లోబల్ కేపబిలిటి సెంటర్ (GCC) అవుతుంది.2025  చివరికల్లా జిసిసి సిద్దం చేసేందుకు  ఈ కంపెనీ పథకం తయారు చేస్తున్నది. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ లో  2500 నుంచి 3000 దాకా టెకీలను రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమవుతూ ఉంది.  జిసిసి ఏర్పాటుకు అవసరమయిన స్థల సేకరణలో కంపెనీ  ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. 

ఈ జిసిసి టెక్నాలజీ డెవెలప్ మెంట్, ఎఐ లతో పాటు ఫైనాన్స్, హెచ్ ఆర్ వంటి రంగా బిజినెస్ సర్సీసులను అందిస్తుంది.

హైనకన్ జిసిసి హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో నే వచ్చే అవకాశం ఉంది. భారత దేశంలో ప్రధాన బీర్ యారీ దారు అయిన యునైటెడ్ బ్రూవరీస్ హైనకన్ కు  61.5శాతం వాటా ఉంది. ప్రస్తుతం హైనకన్ బ్రాండ్ బీర్లని తయారు చేస్తున్నది యునైటెడ్ బ్రూవరీసే

Tags:    

Similar News