సంగారెడ్డిలో హైఅలెర్ట్.. ముస్లిం విద్యార్థులపై గ్రామస్తుల ఆగ్రహం

శివుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు నిరసనబాటపట్టారు. అంతేకాకుండా తమ గ్రామం నుంచి మదర్సాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.;

Update: 2025-04-22 17:48 GMT

సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని శివాలయంలోని శివుని విగ్రహాన్ని కొందరు ముస్లిం విద్యార్థులు ధ్వంసం చేయడమే ఇందుకు కారణం. ఆ విద్యార్థులు జిన్నారం గ్రామంలో ఉన్న ‘మదర్స అరబియ తాలిముల్ ఖురాన్’ స్కూల్‌ చెందిన వారని గ్రామస్తులు చెప్తున్నారు. శివుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు నిరసనబాటపట్టారు. అంతేకాకుండా తమ గ్రామం నుంచి మదర్సాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మతకల్లోలాలు సృష్టించడానికి సదరు స్కూల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ మదర్సా స్కూల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ముస్లిం విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతోనే వారు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ విషయం తెలియడంతో అక్కడికి వెళ్లడానికి బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News