భార్య చేతిలో భర్త హతం

ప్రవర్తన మార్చుకోమన్నందుకు వికారాబాద్ తాండూరులో దారుణం;

Update: 2025-07-21 14:21 GMT

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని రెడ్డిపల్లి వెంకటేశ్‌గా గుర్తించారు. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాండూరు మండలం మల్కాపూర్  గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్‌ను అతని భార్య జయశ్రీ తన తండ్రి పండరితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం పదేళ్ల క్రితం వెంకటేష్, జయశ్రీల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, జయశ్రీ ప్రవర్తన పెళ్లయినప్పటి నుంచి సరిగా లేదు. దీంతో వెంకటేష్ పలుమార్లు ఆమెను వారించినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని జయశ్రీ నిర్ణయించుకుంది. తన తండ్రి పండరితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసింది.  వెంకటేష్ మద్యం సేవించినప్పుడు గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనపై కరన్‌కోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు జయశ్రీ, పండరిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. భార్య కు సహకరించిన వ్యక్తులు వంటి అంశాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.
Tags:    

Similar News