HYDRAA | హైడ్రా కమిషనర్ వర్సెస్ సుప్రీం న్యాయవాది, వాడివేడి వాదనలు
ఇళ్ల స్థలాల విషయంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంల మధ్య వాడి వేడి వాదనలు జరిగాయి.;
By : The Federal
Update: 2025-02-07 11:55 GMT
రంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో ఐలాపూర్ ప్లాట్ల వ్యవహారం శుక్రవారం వివాదాస్పదంగా మారింది. ఐలాపూర్ బాధితులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం అయ్యారు. ఫ్లాట్ అసోసియేషన్ ఫ్లాట్ల కబ్జా గురించి గత వారం బాధితులు హైడ్రా కమిషనరుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు హైడ్రా కమిషషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మరియు సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీమ్ ల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి.కోర్టు ఉత్తర్వులున్నా, వాటిని ఉల్లంఘించి ఇళ్లను కూలగొట్టారని సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ప్రశ్నించారు. దీనిపై మీరు కంటెప్ట్ పిటిషన్ వేసుకోండని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమాధానమిచ్చారు. కేసు న్యాయస్థానం ముందు ఉన్నప్పుడు ఐలాపూర్‌ను ఎలా సందర్శిస్తారని న్యాయవాది రంగనాథ్‌ను ప్రశ్నించారు.బుద్ధ భవన్‌లో ప్రజావాణి సందర్భంగా వివిధ లేఅవుట్‌లపై ప్రజల నుండి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఐలాపూర్,చక్రిపురి కాలనీలను సందర్శించారు.శుక్రవారం అమీన్‌పూర్ మండలంలో ఇలాపూర్ ప్లాట్ల బాధితులతో ఏజెన్సీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కమిషనర్ హైడ్రా ఎవి రంగనాథ్ మరియు సుప్రీంకోర్టు న్యాయవాది ముకిమ్ మధ్య వాడివేడి వాదనలు జరిగాయి.
కూకట్‌పల్లిలో ప్రహరీ కూల్చివేత
బుద్ధ భవన్‌లో ప్రజావాణి సందర్భంగా వివిధ లేఅవుట్‌లపై ప్రజల నుంచి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఐలాపూర్,చక్రిపురి కాలనీలను సందర్శించారు.కూకట్‌పల్లి - నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని బుధవారం హైడ్రా కూల్చివేసింది.అదే స్థలంలో తనకు కేటాయించిన 300ల గజాల ఇంటి స్థలం ఉందని.. అది కూడా కబ్జాకు గురైందని ఓ మాజీ సైనికుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపగా,దాదాపు 1253 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు తేలింది. దీంతో కబ్జా స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది.
శంషాబాద్ మండలం రాళ్లగూడ విలేజ్ వద్ద ఓఆర్ ఆర్ సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా నిర్మించిన ప్రహరీని హైడ్రా బుధవారం తొలగించింది. 155 మీటర్ల మేర ప్రహరీ నిర్మించడంతో సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా చేశారని రాళ్లగూడ విలేజ్ పరిసర ప్రాంతాల లేఔట్‌ల నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు హైడ్రా చర్యలు తీసుకుంది.మల్కాజిగిరిలో 1200 గజాల స్థలానికి కబ్జాల నుంచి విముక్తి కల్పించారు.నగరంలోని పలు రహదారులకు అడ్డుగా నిర్మించిన ప్రహరీలను హైడ్రా బుధవారం తొలగించింది.కాలనీవాళ్లు ప్రహరీలు నిర్మించి తమ నివాస ప్రాంతాలకు వెళ్లే మార్గాలను మూసేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా చర్యలు తీసుకుంది.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కాప్రా మున్సిపాలిటీలో రాకపోకలకు అడ్డుగా ఎన్ ఆర్ ఐ కాలనీ వారు నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది. దీంతో 4 కాలనీలకు మార్గం ఏర్పడింది. సీనియర్ సిటిజన్ కాలనీ, శాంతి విల్లాస్, లక్ష్మి విల్లాస్, గౌరీనాథ్ పురం, వంపుగూడ కాలనీలకు రాకపోకలు సులభం అయ్యాయి. దమ్మాయిగూడ పోయే ప్రధాన రహదారిక చేరాలంటే గతంలో చుట్టు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని.. ఇప్పుడు కేవలం 100 మీటర్లు ప్రయాణిస్తే సరిపోతోందని సీనియర్ సిటిజన్ కాలనీ వాసులు పేర్కొన్నారు. రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీలను కూల్చిన చోట వెంటనే రోడ్డులు వేస్తామని కాప్రా మున్సిపాలిటీ అధికారులు హామీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు.
♦️కూకట్‌పల్లి - నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని బుధవారం హైడ్రా తొలగించింది. అదే స్థలంలో తనకు కేటాయించిన 300ల గజాల ఇంటి స్థలం ఉందని.. అది కూడా కబ్జాకు గురైందని ఓ మాజీ సైనికుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జర… pic.twitter.com/fvKpJn0idS
— HYDRAA (@Comm_HYDRAA) February 6, 2025