HYDRAA POLICE STATION | హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చేసింది...
సికింద్రాబాద్ లోని బుద్ధభవన్ బీ బ్లాక్ కేంద్రంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.;
By : The Federal
Update: 2025-01-07 15:30 GMT
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023లోని సెక్షన్ 2 ప్రకారం తెలంగాణ రాష్ట్ర హోంశాఖ హైడ్రా పోలీస్ స్టేషన్ ను(HYDRAA POLICE STATION) ఏర్పాటు చేసింది.సికింద్రాబాద్‌లో(Secundrabad) కొత్త హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీఓఎంఎస్ నంబరు 03 తో ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులు,పార్కులు,లేఅవుట్ ఖాళీ స్థలాలు, ఆట స్థలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఈ పోలీసుస్టేషన్ పనిచేయనుంది.
- హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ప్రతిపాదన మేర ఈ ప్రత్యేక పోలీసుస్టేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా అడ్మినిస్ట్రేషన్, లీగల్, ఎస్టేట్స్, ఐటి, రికార్డ్స్, లేక్స్ సహాయక విభాగాలను ఏర్పాటు చేశారు.
- ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ చీఫ్ గా ఏర్పాటైన హైడ్రా హైదరాబాద్ నగరంలోని (Hyderabad) చెరువులు, నాలాలను పరిరక్షించనుంది. సరస్సుల భద్రతా పర్యవేక్షణ బాధ్యతలను హైడ్రా పోలీసులు చూడనున్నారు. ఈ పోలీసుస్టేషన్ హైడ్రా అధికార పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతంలో సరస్సుల పరిరక్షణకు పనిచేయనుంది.హైడ్రా పోలీసులు చెరువుల ఆక్రమణదారులపై న్యాయపరంగా చర్యలు తీసుకోనున్నారు.
- భూ కబ్జాదారులు,ఆక్రమణదారులు,ప్రజా ఆస్తులను నష్టపరిచేవారిపై కేసులు నమోదు చేస్తారు. హైడ్రా పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై కేసులు పెట్టి, ఆస్తుల రక్షణకు సంబంధించిన కేసులు పర్యవేక్షించనున్నారు.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్న అధికారితో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిర్దిష్ట సూచనలపై కేసులు నమోదు చేయనున్నారు.హైడ్రా పోలీస్ స్టేషన్ సిబ్బంది హైదరాబాద్ డిజాస్టర్ కోసం కూడా పనిచేయనున్నారు. ఈ పోలీసుస్టేషనుకు డిప్యూటేషన్‌పైపోలీసు సిబ్బందిని నియమించనున్నారు.