HYDRAA Demolitions | చెరువుల ఆక్రమణలపై హైడ్రా దూకుడు,కూల్చివేతలు షురూ

చెరువు స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలపై హైడ్రా కన్నెర్ర చేసింది. మణికొండలోని నెక్నాంపూర్ చెరువును కబ్జా చేసి నిర్మించిన భవనాలను శుక్రవారం కూల్చివేశారు.;

Update: 2025-01-10 06:42 GMT

మూడు నెలలు చెరువులు, కుంటల ఆక్రమణలను నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ల సాయంతో అధ్యయనం చేసిన హైడ్రా అధికారులు శుక్రవారం నుంచి మళ్లీ యాక్షన్ లోకి దిగారు.

- రంగారెడ్డి జిల్లాలోని మణికొండ మున్సిపల్ పరిధిలో ఉన్న నెక్నాంపూర్ చెరువు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. కొందరు కబ్జాదారులు నెక్నాంపూర్ చెరువులో అక్రమంగా వెలసిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
- లేక్ వ్యూ విల్లాలను అధికారులు కూల్చివేశారు. గతంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు గతంలో కొన్ని భవనాలను కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

మూసీలో పోసిన మట్టి తొలగింపు
మూసీ నదిలో కొన్ని నిర్మాణ సంస్థలు వేసి మట్టిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో నిర్మాణ సంస్థ తొలగించింది. గండిపేటకు చేరువలో నార్సింగి ప్రాంతంలో మూసీలో పోసిన మట్టిని రాజపుష్ప నిర్మాణ సంస్థ తొలగించింది. మూసీ నదిలో మట్టిపోసి కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులపై రెండు వారాల క్రితం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.నదిలో నింపిన మట్టిని వెంటనే తొలగించాలని రాజపుష్ప నిర్మాణ సంస్థకు కమిషనర్ సూచించారు.మట్టి తొలగించాక మూసీ రివర్ డెవలప్ మెంట్ ఫ్రంట్ అధికారులు హద్దులు నిర్ధారించాలని కమిషనర్ ఆదేశించారు.



 తుర్కయాంజాల్ చెరువు సందర్శన

స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు తుర్కయాంజాల్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. చెరువు తూములు మూసేసి అలుగు పెంచడంతో చెరువు పైభాగంలో పంటపొలాలు, ఇళ్లు నీట మునుగుతున్నాయని స్థానికులు ఈ నెల 6 వ తేదీన హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై కమిషనర్ నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.



 చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ పై అధ్యయనం

చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పై ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో చర్చిస్తామని కమిషనర్ చెప్పారు. ఐఐటి, బిట్స్ పిలాని,జెఎన్ టీయూ విద్యాలయాల ఇంజనీరింగ్ నిపుణులతో కూడా చెరువుల పై అధ్యయనం చేపిస్తామని కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. నేషనల్ రిమోట్ ఏజెన్సీ ఫొటోలు, గ్రామాలకు చెందిన మ్యాప్స్ ను పరిశీలించి రెండు మూడు నెలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో చెరువు ఎఫ్టీఎల్ ను నిర్ధారిస్తామని కమిషనర్ వివరించారు. తుర్కయాంజాల్ చెరువు విస్తరణ 495 ఎకరాల్లో ఉందని అధికారులు చెప్పారు.


Tags:    

Similar News