నిలిచిన హైడ్రా అత్యవసర సేవలు..
ప్రజారక్షణ ప్రమాదంలో పడినట్లేనా..!;
హైదరాబాద్ విపత్తు నిర్వహణ సంస్థ(HYDRAA) అత్యవసర సేవలు నిలిచాయి. జీతాలు తగ్గించడంలో మార్షల్స్ అంతా నిధులను బహిస్కరించారు. దీంతో హైడ్రా కంట్రోల్ రూమ్‌లు బంద్ అయ్యాయి. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే హైదరబాద్‌లో వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో హైడ్రా యంత్రాంగం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను రంగంలోకి దించింది. ఈ సేవల్లో మార్షల్స్, డీఆర్ఎఫ్ టీమ్స్, ట్రాఫిక్ సపోర్ట్ టీమ్‌లు, క్లీనప్ సిబ్బంది భాగంగా ఉన్నారు. ఒక్కో టీమ్‌లో 4 మందితో మూడు షిఫ్టుల్లో మొత్తం 150 డివిజన్‌లలో సేవలు అందిస్తున్నారు.
జీతాలు తగ్గించడంతో అసంతృప్తికి గురైన మార్షల్స్ సమూహంగా పనికి హాజరుకాకపోవడంతో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలు అంతరాయానికి గురయ్యాయి. ట్రైనింగ్ కార్యక్రమాలు, ప్రజావాణి వంటి ప్రజా సేవలు నిలిచిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో మార్షల్స్ అందించే సాయాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ ప్రభావం కారణంగా హైడ్రా విభాగంలోని 51 భారీ వాహనాలు పనిలోకి రాలేదు. వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులు, వరద నివారణ చర్యలు, రోడ్లపై చెట్లు కూలడం వంటి ఘటనలకు వెంటనే స్పందించే బృందాలు అందుబాటులో లేకపోవడంతో నగరంలో ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు సమస్య పరిష్కారానికి చర్చలు ప్రారంభించకపోతే నగరంలో మాన్సూన్ సీజన్‌లో ప్రజా రక్షణ చర్యలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవైపు హైద్రాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ సమయంలో హైడ్రా అత్యవసర సేవలను నిలిచపోవడం ఆందోళన కరమైన అంశంగా అధికారులు భావిస్తున్నారు. ఇదే సరైన సమయం అనుకునే తమ డిమాండ్‌లు నెరవేర్చాలని కోరుతూ హైడ్రా మార్షల్స్ సమ్మెకు పిలుపునిచ్చినట్లు చర్చ జరుగుతోంది. 2020 ఫిబ్రవరిలో విదుల్లో చేరిన మార్షల్స్ ఆ తర్వాత హైడ్రాలో చేరారు. వారికి దాదాపు రూ.7వేల జీతం తగ్గించడంతో వారు సమ్మెబాట పట్టారు. ఈ సమయంలో హైడ్రా ఏం చేస్తుంది? ప్రభుత్వం దీనిని ఎలా హ్యాండిల్ చేస్తుంది? అనేది కీలకంగా మారింది.