క్యాట్ దెబ్బకు ఐఏఎస్ లకు షాక్..గంటల్లో తేల్చేసింది

మంగళవారం మధ్యాహ్నం మొదలైన విచారణలో క్యాట్ అనేక ప్రశ్నలతో ఐఏఎస్ లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

Update: 2024-10-15 11:18 GMT
IAS officers

సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) దెబ్బకు ఐఏఎస్ లకు షాక్ కొట్టింది.  మంగళవారం మధ్యాహ్నం మొదలైన విచారణను క్యాట్ కొన్ని గంటల్లోనే తేల్చేసింది. డీవోపీటీ ఆదేశాల ప్రకారం ఎలాట్ చేసిన రాష్ట్రాలకు వెళ్ళి పనిచేయాల్సిందే అని తేల్చేసింది. క్యాట్ విచారణ చాలా కాలం పడుతుందని ఊహించిన ఐఏఎస్ ల ఆలోచనలకు భిన్నంగా క్యాట్ గంటల్లోనే విషయాన్ని తేల్చేసింది. సో, క్యాట్ తాజా ఆదేశాల ప్రకారం అర్జంటుగా డీవోపీటీ ఎవరిని ఎక్కడ రిపోర్టు చేయమని చెప్పిందో వెంటనే వెళ్ళక తప్పదు. క్యాట్ తాజా తీర్పు కేసులు వేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కేసులు వేయని మిగిలిన వాళ్ళ విషయం ఏమిటో చూడాలి. విచారణ మొదలైన దగ్గర నుండి కూడా  క్యాట్ అనేక ప్రశ్నలతో ఐఏఎస్ లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. తాజా విచారణలో క్యాట్ సంధించిన ప్రశ్నలతో వీళ్ళందరికీ భవిష్యత్తు ఎలాగ ఉండబోతోందో అర్ధమైపోయుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలోని ఎనిమిది మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీలో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది. అలాగే ఏపిలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులను తెలంగాణాలో రిపోర్టు చేయాలని చెప్పింది. పై 11 మంది తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయటానికి బుధవారం అంటే 16వ తేదీన డెడ్ లైన్. డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను చాలెంజ్ చేస్తు 11 మందిలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు అమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాణీప్రసాద్, వాకాటి కరుణతో పాటు ఏపీ ఐఏఎస్ అధికారి గుమ్మల సృజన క్యాట్ లో కేసులు వేశారు. ఆ కేసును క్యాట్ ను మంగళవారం విచారించింది.

విచారణ సందర్భంగా క్యాట్ ఐఏఎస్ లకు పలుప్రశ్నలు సంధించింది. విజయవాడలో తుపాను దెబ్బకు అనేకమంది ఇబ్బందులు పడుతుంటే అక్కడికి వెళ్ళి సేవచేయాలని ఎందుకు అనుకోవటంలేదని అడిగింది. సరిహద్దు(బార్డర్)కు వెళ్ళి సేవచేయమంటే అప్పుడు కూడా వెళ్ళమనే అంటారా అని నిలదీసింది. సమస్యలు వచ్చినపుడు జనాల్లోకి వెళ్ళి సేవచేయకుండా ఇంట్లోనే కూర్చుని డ్యూటీలు చేస్తామంటే ఎలా కుదురుతుందని నిలదీసింది. క్యాట్ అడిగిన చాలా ప్రశ్నలకు ఐఏఎస్ ల తరపు లాయర్లు సరైన సమాధానాలు చెప్పలేదని సమాచారం. డీవోపీటీ ఆదేశాలపై స్టే అడిగిన ఐఏఎస్ అధికారులను అనేక ప్రశ్నలతో క్యాట్ ఉక్కిరి బిక్కిరి చేసేసింది.

డీవోపీటీ ఆదేశాలపై స్టే అంశంతో పాటు అనేక సర్వీసు వ్యవహారాలపైన కూడా ఐఏఎస్ తరపు లయర్లను క్యాట్ గట్టిగానే నిలదీసింది. మొత్తంమీద క్యాట్ సంధించిన ప్రశ్నలను చూస్తే డీవోపీటీ ఆదేశాలపై సానుకూల తీర్పు వస్తుందని ఐఏఎస్ ల్లో నమ్మకం తగ్గిపోయుంటుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి గతంలోనే డీవోపీటీ ఆదేశాలను చాలెంజ్ చేస్తు కేసులు వేసిన ఐఏఎస్ లకు చుక్కెదురైంది. క్యాట్ లో ఐఏఎస్ ల వాదన చెల్లలేదు. డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందే అని క్యాట్ అప్పట్లోనే తీర్పిచ్చింది. క్యాట్ తీర్పును చాలెంజ్ చేస్తు ఐఏఎస్ లు సుప్రింకోర్టులో కేసు వేశారు. అయితే క్యాట్ తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సుప్రింకోర్టు ఇష్టపడలేదు. తాజా క్యాట్ తీర్పు  కాపీ చేతికి వచ్చిన తర్వాత హైకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు ఐఏఎస్ అధికారుల లాయర్లు మీడియాతో చెెప్పారు. 

Tags:    

Similar News