తెలంగాణలో ద్రోణి ప్రభావం, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు
తెలంగాణలో ద్రోణి ప్రభావం వల్ల పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులు,ఈదురుగాలులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.;
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆదివారం భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ఆదివారం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ సందర్భంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 22 జిల్లాల్లో అలర్ట్ జారీ తెలంగాణలోని 22 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్,సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, మహబూబ్ నగర్,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. ఈదురు గాలుల ప్రభావం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో గరిష్ణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. చార్మినార్‌లో 42 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 44.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఏడు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణలోని పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగడంతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు వెల్లడించారు.ఈ ఏడు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం వర్షాలు కురిశాయి. మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
మరికొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోయారు. మే నెలలో పెరగనున్న ఎండలు తెలంగాణలో మే నెలలో ఎండలు మరింత ముదిరే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్షియస్ కు చేరుకున్నాయని, మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ కేంద్రం అధకారులు చెప్పారు. మే నెలలో ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు చెప్పారు.
ద్రోణి ప్రభావం వల్ల...