ఒళ్లంతా చూపి, మా అందం, మా స్వేచ్ఛ అంటే ఎలా? నటి సుహాసిని సూటిప్రశ్న

అంగాంగ ప్రదర్శన, క్లోజ్ సీన్లలో నటించడం వంటి వాటిని ఏమనాలి? ఇవన్నీ భావప్రకటనా స్వేచ్ఛ, స్త్రీ విముక్తి కిందికి వస్తాయా? అని ప్రశ్నిస్తున్నారు సినీనటి సుహాసిని.

Update: 2024-10-28 06:04 GMT
"ఒళ్లు చూపించడం భావ ప్రకటనా స్వేచ్ఛ అవుతుందా? అంగాంగ ప్రదర్శన విముక్తి అవుతుందా?" అని నిలదీశారు సినీజగత్తులో ఓవెలుగు వెలిగిన ప్రముఖ నటి సుహాసినీ మణిరత్నం. ఫిల్మ్ ఇండస్ట్రీపై మహిళలు దోపిడీకి గురవుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుహాసిని మణిరత్నం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో నటిస్తున్న ప్రముఖ హిరోయిన్. సుహాసిని చిత్ర పరిశ్రమలో మహిళా ప్రాతినిధ్యానికి ఆమె ప్రతినిధి అని చెప్పవచ్చు. ఎంతసేపూ హిరోయిన్ల ఒళ్లు చూపించి సొమ్ము చేసుకోవాలనే ధ్యాస తప్ప అదెలా భావప్రకటనా స్వేచ్ఛ అవుతుందో చెప్పండంటూ నిలదీశారు. ఒళ్లు చూపించడాన్ని విముక్తితోనో, స్వేచ్ఛతోనో సరిపోల్చాలని చూడడం దుర్మార్గం, వికృత ఆలోచన కాదా? అన్నారు సుహాసిని. ఇటీవలి "మాతృభూమి" పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ ప్రపంచంలో మహిళలు ఎలా దోపిడీకి గురవుతున్నారో వివరించారు. సమకాలీన సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని ఎలా చూస్తారు అని అడిగిన ప్రశ్నకు ఆమె సుదీర్ఘంగా జవాబు ఇచ్చారు.

పాశ్చాత్య సినిమా ప్రభావం భారతీయ సినిమాను కమ్మేసిందని, మహిళల అంగాంగ ప్రదర్శన స్వేచ్ఛ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారతీయ సినీ ప్రపంచంలో కలకలం రేపాయి. అనుకూల ప్రతికూల స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఆమె ఏమి చెప్పారంటే...
“వెస్ట్రన్ సినిమాను "కాపీ" చేయాలనే తపనతో కళాకారులు దారి తప్పిపోయారు. వెస్ట్రన్ సినీ ప్రభావం వల్ల స్కిన్ ఎక్స్‌పోజర్, క్లోజ్ సీన్స్‌లో చాలా స్వేచ్ఛ ఉంది. ఆ సీన్లు అర్థవంతంగా ఉంటే పర్వాలేదు. కానీ అలా ఉండడం లేదు. హిరోయిన్ శరీరాన్ని చూపించేందుకు పడే తాపత్రయంలా ఉంటోంది. బాడీ ఎక్స్‌పోజర్ (అంగాంగ ప్రదర్శన) అయినా, క్లోజ్ (ఇంటిమేట్) సీన్స్ అయినా మహిళలు ఇష్టంగా చేస్తున్నారు. ఈ పోటీలో ఉండటానికి- అలాంటి సన్నివేశాలను గతంలో ఇబ్బందిగా చేయాల్సి వచ్చింది. కానీ ఈ రోజు కొందరేమంటున్నారంటే.. 'మానసికంగా నేను దీన్ని చేయడానికి స్వేచ్ఛగా ఉన్నాను. ఇదేదో డబ్బు కోసమో, చిత్రసీమలో నెంబర్ వన్ గా ఉండడం కోసమో కాదు, కానీ నాకు ఏది కావాలంటే అది చేస్తాను. అది భావప్రకటన స్వేచ్ఛ, లిబరేషన్ అంటున్నారు” ఇది సరైన వాదన కాదని నా అభిప్రాయం. సినిమాలలో స్త్రీలు దోపిడీకి గురవుతున్నారని నేను భావిస్తున్నాను.
“2000ల సంవత్సరం వరకు వాణిజ్య పరమైన సినిమాలలో మహిళలు నటించేలా మచ్చిక చేసుకునే వారు. (టేమింగ్ ఆఫ్ ది ష్రూ.. షేక్‌స్పియర్ రాసిన నాటకం అది. అందులో ఓ మహిళను పెళ్లికి ఒప్పించడం ప్రధానాంశం. సుహాసిని ఇప్పుడా విశేషణాన్ని వాడారు ఇక్కడ). కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్‌ పాత్ర ప్రముఖమైంది. అది విజయ్ సినిమా అయినా మరెవరి సినిమ అయినా సరే. ఇప్పుడు విజయ్ ఆ పని చేయాల్సిన అవసరం లేదు. హిరోయిన్ ఆసిన్, తదితరులతో విజయ్ సినిమాలు చేశారు. వాటిల్లో చేసింది మహిళల్ని మచ్చిక చేసుకునే పనే కదా. ఇది కూడా కథే కదా? అవునా, కాదా" అని ఆమె ప్రేక్షకులను అడిగారు.
“మేము చాలా ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాం. కానీ మేము ఫిర్యాదు చేయలేదు. మరి మేమిప్పుడు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నామంటే మహిళలు మేల్కొనాలని, ప్రతి సినిమా మహిళల్ని మచ్చిక చేసుకునే విధంగా ఎందుకుండాలని ప్రశ్నిస్తున్నాం. మీరు ఏ హిందీ సినిమా అయినా తీసుకోండి. ఓ పొగరుబోతు, అహంకారి, ఆధునిక అమ్మాయిని మరో పురుషడు తెలివిగా లోబరుచుకోవడమే కదా ఉంటుంది? అన్ని సినిమాలలో ఇదే ప్రధాన ఇతివృత్తం. ఇది నిజం కాదా" అని ప్రశ్నించారు. "అందువల్ల నేను చెప్పేదేమంటే కమర్షియల్ సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం మారిపోయింది" అన్నారు.
సుహాసిని గురించి నాలుగు మాటలు...
సుహాసినీ మణిరత్నం గురించి తెలియని వారు ఎవరుంటారు ప్రస్తుత జనరేషన్ లో. ఆమె ప్రముఖ నటుడు కమల్ హసన్ కజిన్. సుహాసిని మణిరత్నం 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. బంధన, సుప్రభాత, ముతియ హార, హిమపథ, హెండిత్‌గెల్తిని, మత్తాడ్, మత్తాడ్ మల్లిగే, స్కూల్ మాస్టర్ వంటి చిత్రాలలో నటించారు.
కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 1985నాటి తమిళ చిత్రం సింధు భైరవిలో ఆమె పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది. సుహాసిని 1988లో మణిరత్నంను వివాహం చేసుకున్నారు. 1992లో కుమారుడు నందన్ పుట్టారు. ఈ జంట 1997 నుంచి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ ను నడుపుతున్నారు.
Tags:    

Similar News