Manchu Manoj controversy|అందుకనే మనోజ్ వివాదంలోకి లాగుతున్నాడా ?

తన ఫిర్యాదుపై విచారణ పారదర్శకంగా జరిపి, తగిన న్యాయం చేయాలని చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్, హోంశాఖ మంత్రి అనితను ట్విట్టర్లో రిక్వెస్టుచేయటం గమనార్హం.

Update: 2024-12-10 08:30 GMT
Manchu Manoj

ఇంటి వివాదంతో రోడ్డుకెక్కిన మంచు ఫ్యామిలీ గొడవల్లోకి మంచు మనోజ్ రెండు రాష్ట్రాలను లాగుతున్నట్లే అనిపిస్తోంది. విభేదాలు మొదలైంది తండ్రి మోహన్ బాబు, కొడుకు మంచు మనోజ్ మధ్య. దాడులు చేసుకున్నది తండ్రి, కొడుకులే. ఫిర్యాదులు చేసుకున్నది, కేసులు నమోదైంది కూడా తండ్రి, కొడుకుల మీదనే. కాబట్టి ఇద్దరి మధ్యా విభేదాలు, పరస్పర దాడులపై పోలీసులు కేసులు నమోదుచేసుకుని విచారణ మొదలుపెట్టారు. వివాదం మొదలైంది, తీవ్రస్ధాయికి చేరుకున్నది, గొడవలై దాడులు జరిగి ఫిర్యాదులు చేసుకుని కేసులు నమోదైంది అంతా హైదరాబాదులోనే. కాబట్టి ఆస్తుల గొడవలైనా ఫిర్యాదులు, కేసులు, విచారణ మొత్తం తెలంగాణాకు మాత్రం పరిమితం.

అయితే మనోజ్ మాత్రం ట్విట్టర్లో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, అనిత, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు తెలంగాణా డీజీపీని రిక్వెస్టుచేశాడు. తమ గొడవలు, దాడులు, ఫిర్యాదులు, కేసుల విషయంపై పోలీసులు పారదర్శకంగా విచారణ జరిపి తనకు తగిన న్యాయం చేయాలని రిక్వెస్టు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. గొడవలు జరిగి ఫిర్యాదులు చేసుకుని, కేసులు నమోదుచేసి విచారణ చేస్తున్నది తెలంగాణా పోలీసులు మాత్రమే. మరీ వివాదంలో ఏపీకి ఏమి సంబంధం ? తన ఫిర్యాదుపై విచారణ పారదర్శకంగా జరిపి, తగిన న్యాయం చేయాలని చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్, హోంశాఖ మంత్రి అనితను ట్విట్టర్లో రిక్వెస్టుచేయటం గమనార్హం. చంద్రబాబు, పవన్, అనిత చేయగలిగింది కూడా ఏమీలేకపోయినా ఎందుకని వీళ్ళందరినీ లాగుతున్నట్లు ? ఎందుకంటే తన తండ్రి మోహన్ బాబును కాదని తెలంగాణా పోలీసులు తనకు న్యాయం చేస్తారని నమ్మకం లేకపోవటమే. తాను రిక్వెస్టుచేసినా పట్టించుకోలేదనే అపనిందతో చంద్రబాబు, పవన్, అనిత మీద మనోజ్ అభిమానులు గొడవచేయటానికి మాత్రమే మనోజ్ ప్రయత్నం పనికొస్తుంది.

నిజానికి రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి, తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా చేయగలిగేది పెద్దగా ఉండదు. ఎందుకంటే తండ్రి, కొడుకుల్లో ఎవరు చెబుతున్నది నిజం, ఎవరు ఎవరిపైన దాడిచేశారన్న విషయంలో బయటవాళ్ళకు క్లారిటీలేదు. మనోజ్ ఆసుపత్రిలో చేరి గాయాలకు చికిత్స చేయించుకుని డాక్టర్ సర్టిఫికేట్ తో ఫిర్యాదు చేశాడు. కాబట్టి మనోజ్ కాలు, మెడపైన గాయాలున్నట్లు అర్ధమైంది. ఒంటిపైన గాయాలు అయ్యాయి కాబట్టి మనోజ్ మీద దాడి జరిగిందన్న విషయంలో క్లారిటి ఉంది. అయితే మనోజ్ పైన మోహన్ బాబు దాడి చేశాడని ఒకసారి కాదు కాదు మోహన్ బాబు సమక్షంలోనే ఆయన మద్దతుదారుడు, విద్యాసంస్ధల్లో కీలక వ్యక్తి వినయ్+అనుచరులు దాడిచేశారని ప్రచారం తెలిసిందే. కాబట్టి మనోజ్ పైన వాస్తవంగా దాడి చేసింది ఎవరనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది.

వివాదంలో, దాడులపైన ఇంత అయోమయం కంటిన్యు అవుతుండగా మనోజ్ మాత్రం ఇటు రేవంత్ తో పాటు అటు చంద్రబాబును వివాదంలోకి లాగుతూ ట్వీట్టర్లో రిక్వెస్టుచేయటమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనితను వివాదంలో న్యాయంచేయాలని రిక్వెస్టుచేయటం అంటే చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది. ఎలాగంటే మనోజ్ కు పోలీసుల మీద నమ్మకం ఉన్నట్లు లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించటమే సాక్ష్యం. తన మనుషులను ఫామ్ హౌసులో నుండి బయటకు పంపేసి తన వ్యతిరేకుల మనుషులు, బౌన్సర్లను మాత్రం ఫామ్ హౌసులోనే పోలీసులు ఉంచినట్లు మండిపడ్డాడు. ఈ ఆరోపణలతోనే పోలీసులపై మనోజ్ కు నమ్మకం లేదని అర్ధమైపోతోంది.

అందుకనే ముందుజాగ్రత్తగా రేవంత్, భట్టీ, చంద్రబాబు, పవన్, అనితను వివాదంలోకి లాగుతున్నట్లు అర్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మనోజ్ ఎవరెవరిని అయితే వివాదంలోకి లాగుతున్నాడో వాళ్ళంతా మోహన్ బాబుకు అత్యంత సన్నిహితులు. తండ్రి ద్వారా మాత్రమే చంద్రబాబు, రేవంత్, పవన్ లాంటి వాళ్ళు మనోజ్ కు పరిచయం అయ్యుంటారన్నది మరచిపోకూడదు. మరి ఇంతమందిని మనోజ్ వివాదంలోకి లాగినా ఏ మేరకు న్యాయం జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News