తెలంగాణా బీజేపీ అసలు సమస్యిదేనా ?

బీజేపీకి అసలైన సమస్య ఏమిటంటే గట్టి ఫేస్ వాల్యు లేకపోవటమే. కమలంపార్టీలో క్రౌడ్ పుల్లర్ అని చెప్పుకోవటానికి ఒక్కరంటే ఒక్కనేత కూడా కనబడరు.

Update: 2024-04-07 11:51 GMT
bjp

ఎన్నికల ప్రచారంలో క్రౌడ్ పుల్లర్ల ప్రభావం చాలానే ఉంటుంది. క్రౌడ్ పుల్లర్ల ప్రసంగాలకు జనాలు బాగా స్పందిస్తారు. పార్టీ అదినేతలు, క్రౌడ్ పుల్లర్లు ఒకళ్ళే అయితే పార్టీలకు బాగా ఉపయోగం. క్రౌడ్ పుల్లరంటే మంచి మాటకారయ్యుండాలి, జనాలను ఆకర్షించే కెపాసిటి ఉండుండాలి. ఆర్ధిక, అంగబలాలు ఎలాగు తప్పవు. ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణా కాంగ్రెస్ కు క్రౌడ్ పుల్లర్ గా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ ఎక్కడికైనా వస్తున్నారని తెలిస్తే చాలు జనాలు గుమిగూడుతారు. ఎందుకంటే జనాలను ఆకర్షించే శక్తి రేవంత్ కు పుష్కలంగా ఉంది. మంచి మాటకారి కావటమే కాకుండా చెప్పదలచుకున్నది సూటిగా సుత్తిలేకుండా చెప్పడటం రేవంత్ కు ప్లస్ పాయింట్. బక్కపలచటి పర్సనాలిటి కూడా రేవంత్ కు ప్లస్సనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా రేవంత్ సభలకు జనాలు బాగా హాజరయ్యేవారు.

ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కే చంద్రశేఖరరావు కూడా మంచి మాటకారే. జనాలను ఆకర్షించగలిగిన శక్తున్న నేతనే చెప్పాలి. అయితే ఇవన్నీ అధికారంలో ఉన్న పదేళ్ళు చెల్లుబాటయ్యాయి కాని ఇపుడు చెల్లటంలేదు. మొన్నటి అసెంబ్లీల ఎన్నికల్లో ఓటమి కేసీయార్ ను బాగా కుంగదీసేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ముఖ్యంగా రేవంత్ అంటే కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతోంది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే కేసీయార్ నోటికేదొస్తే అదల్లా మాట్లాడేస్తున్నారు. నోరిప్పితే బూతులు తప్ప ఇంకేమీ మాట్లాడటంలేదు. అధికారంలో ఉన్నపుడు ఎలాంటి అహకారపు మాటలు మాట్లాడేవారో ఇపుడు కూడా అదే అహంకారంతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ గెలుపంతా వాపే కాని బలుపు కాదని జనాల్లో చర్చలు జరుగుతోంది. అందుకనే జనాధరణ తగ్గిపోతోంది.

ఇక ఉన్నది బీజేపీ మాత్రమే. బీజేపీకి అసలైన సమస్య ఏమిటంటే గట్టి ఫేస్ వాల్యు లేకపోవటమే. కమలంపార్టీలో క్రౌడ్ పుల్లర్ అని చెప్పుకోవటానికి ఒక్కరంటే ఒక్కనేత కూడా కనబడరు. కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు జీ. కిషన్ రెడ్డి మాటకారి కాదు జనాలను ఆకర్షించేంత శక్తీలేదు. ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కూడా అంత సీన్ లేదు. బండి ఏమి మాట్లాడుతారో చాలామందికి సరిగా అర్ధంకూడా కాదు. ఏ కోణంలో చూసినా జనాలను ఆకర్షించేత స్ధాయినేతలు బీజేపీలో ఎవరు లేరనే చెప్పాలి. బీజేపీకి ఇదే అతిపెద్ద సమస్యగా మారింది. కిషన్ కు వాగ్ధాటి ఉంది కాని మంచి మాటకారైతే కాదు. ఏదో రొడ్డకొట్టుడులాగ మాట్లాడుతూ పోతారంతే. మొన్నటి ఎన్నికల్లో పార్టీ 8 అసెంబ్లీ సీట్లలో గెలిచిందంటే అది అభ్యర్ధుల కెపాసిటి, బీజేపీ ఇమేజిపైన మాత్రమే.

రేపటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా జనాలు బీజేపీకి ఓట్లేయాలంటే అభ్యర్ధుల కెపాసిటి, నరేంద్రమోడి ఇమేజికి అదనంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం సెంటిమెంటనే చెప్పాలి. ఏదేమైనా క్రౌడ్ పుల్లర్ అనేస్ధాయిలో గట్టి నేత లేకపోవటం బీజేపీకి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఈ సమస్యను అధిగమించటానికి నేతలు కూడా పెద్దగా కనబడటంలేదు. బండి అయినా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ అయినా ఎంతసేపు ఓల్డ్ సిటి, భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణాలు, ముస్లింలకు వ్యతిరేకంగా కామెంట్లు చేయటంతోనే సరిపోతుంది. మరీ సమస్యను పార్టీ ఎప్పటికి అధిగమిస్తుందో చూడాలి.

 

Tags:    

Similar News