లగచర్ల అరెస్టులకు అసలు కారణం ఇదేనా ?

లగచర్ల(Lagacharla)లో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అరెస్టులకు అసలు కారణం బయటపెట్టారు

Update: 2024-11-21 08:09 GMT
National ST Commission member Hussain NaiK

లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ చాలా సీరియస్ అయ్యింది. లగచర్ల(Lagacharla)లో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అరెస్టులకు అసలు కారణం బయటపెట్టారు. కొడంగల్(Kodangal) నియోజకవర్గంలో ఫార్మా యూనిట్ల(Pharma Units) ఏర్పాటుకు ప్రభుత్వం 1100 ఎకరాలు సేకరించాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే లగచర్ల, పోలేపల్లి, హకీంపేట గ్రామాల్లో భూములు సేకరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్(Prateek Jain) నిర్ణయించారు. అందుకని మొదట లగచర్ల గ్రామసభ ఈనెల 11వ తేదీన నిర్వహించారు. గ్రామసభ మొదలవ్వగానే రైతులు, గ్రామస్తుల్లో కొందరు కలెక్టర్ తో పాటు ఇతర అధికారులపైన దాడిచేశారు. కలెక్టర్ మీద దాడి ఘటన తెలంగాణాలో పెద్ద సంచలమైపోయింది. దాడికి సంబంధించి పోలీసులు వీడియోలను విశ్లేషణలు చేసి సుమారు 50 మందిని అరెస్టుచేశారు. దాడిచేసిన వారిలో కొందరు లగచర్ల నుండి మాయమైపోయారు.

అలా మాయమైపోయిన వారికోసం వాళ్ళ ఇళ్ళమీద పోలీసులు దాడులుచేసి ఆడవాళ్ళను, పిల్లలను నిర్బంధించి పోలీసుస్టేషన్ కు తీసుకెళ్ళారు. నిర్బంధించినపుడు స్టేషన్ లో ఆడవాళ్ళపైన పోలీసులు అరాచకంగా వ్యవహరించినట్లు చాలా ఆరోపణలున్నాయి. తర్వాత కొద్దిరోజులకు ఆడవాళ్ళను పోలీసులు వదిలిపెట్టారు. అలా బయటకు వచ్చిన ఆడవాళ్ళను వెంటనే బీఆర్ఎస్ నేతలు పార్టీ కార్యాలయంకు తీసుకెళ్ళారు. అక్కడినుండి ఆడవాళ్ళపై పోలీసుల ధౌర్జన్యాలు, అరాచకాలను బీఆర్ఎస్(BRS) నేతలు బాగా హైలైట్ చేయించగలిగారు. బాధితులను ఢిల్లీకి తీసుకెళ్ళి ఎస్టీ, ఎస్సీ కమిషన్(SC and ST Commission), మానవ హక్కుల కమిషన్(Human Rights Commission) కు తీసుకెళ్ళి ఫిర్యాదులు చేయించారు.

బాధితులతో కమిషన్లకు ఫిర్యాదులు చేయించటమే కాకుండా జాతీయ మీడియాతో కూడా మాట్లాడించారు. దాంతో లగచర్ల గొడవకు బాగా ప్రాధాన్యత పెరిగిపోయింది. బాధితులు ఎస్టీ, ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయగానే కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ (Hussain Naik) లగచర్లలో పర్యటించారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. నాయక్ పర్యటనలో తమను పోలీసులు ఏ విధంగా నిర్బంధించారు, ఏ విధంగా వేధించారనే విషయాలను పూసగుచ్చినట్లు వివరణలతో కూడిన ఫిర్యాదులు చేశారు. దాంతో డైరెక్టుగా బాధితులతో మాట్లాడిన సభ్యుడు నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. లగచర్ల కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టును 10 రోజుల్లో అందించాలని డీజీపీ, కలెక్టర్, ఎస్పీని హుస్సేన్ నాయక్ ఆదేశించారు.

రిపోర్టు ఇచ్చేంతవరకు పోలీసులు మామూలు ప్రజల జోలికి వెళ్ళవద్దని, అరెస్టులు చేయద్దని ఎస్పీని నాయక్ ఆదేశించారు. దాడిచేసిన వాళ్ళని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదన్న కోపంతో సంబంధంలేని వాళ్ళని అరెస్టులు చేస్తున్నట్లు నాయక్ ఆగ్రహంవ్యక్తంచేశారు. కాంగ్రెస్ కు ఓట్లేయలేదన్న కారణంగానే సంబంధంలేని వాళ్ళని అరెస్టులు చేశారన్న నాయక్ ఆరోపణ ఇపుడు పెద్ద చర్చనీయంశమైంది. సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల బాధిత రైతులను కలిసిన నాయక్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొత్తంమీద లగచర్ల ఎస్టీ కమీషన్

Tags:    

Similar News