తెలంగాణ అల్లాదుర్గంలో జినపాద సింహాసనం
అరుదైన శాసనసహిత, జినపాద సింహాసనంతో జైనబసదిని గుర్తించిన కొత్త తెలంగాణచరిత్రబృందం;
అల్లాదుర్గంలో అరుదైన జినపాద సింహాసనం, శాసనాన్నికొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, మఠం వినోద్ కుమార్, సిరిపురం వినోద్ కుమార్ గుర్తించారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని బేతాళుని గుడి మంటపస్తంభాలమీద ఉన్న రెండు శాసనాలలో రెండు జైనబసదులు 1. బద్దిగ జినాలయం, 2. కీర్తివిలాస శాంతిజినాలయం ప్రస్తావించబడ్డాయి. ఎల్లమ్మగుడి, హనుమాండ్ల గుడి, బేతాళునిగుడి మూడుచోట్ల కూడా జైనబసదుల ఆనవాళ్ళు లభిస్తున్నాయని శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
శ్రీరామోజు హరగోపాల్
గుడిలో హనుమంతుని విగ్రహానికి కుడివైపు గూటిలో పాలరాతి సింహాసనం, మీద పాదాలు, వెనక గుండ్రని రాతిపలకమీద నాగరిలిపిలో మూడుపంక్తుల శాసనం వున్నాయి. సింహాసనం ముందుభాగాన అభిషేక జలాలు పోవడానికి సింహముఖప్రణాళి వుంది. ఇది జినుని పాదాల సింహాసనం. ఇంతకు మునుపు మరెక్కడా కనిపించని కొత్తశిల్పం. హనుమాన్ దేవాలయం ఒకప్పటి జినాలయమే. ఈ గుడి బద్దెగ లేదా కీర్తివిలాస శాంతిజినాలయాలలో ఒకటై వుంటుందని ఆయన తెలిపారు.