క్లారిటీ లేకుండానే కాళేశ్వరం కట్టారా..?

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్లను కేసీఆరే మార్చారని కమిటీ చెప్పిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.;

Update: 2025-08-31 12:22 GMT

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికపై చర్చ మొదలైంది. కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదవి వినిపించారు. ఈ సందర్భంగానే బ్యారేజీకి, డ్యామ్‌కు తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారని ఎన్‌డీఎస్‌ఏ తన నివేదికలో తెలిపిందని చెప్పారాయన. మేడిగడ్డలో నిబంధనలకు విరుద్ధంగా పూర్తి నిల్వతో మేడిగడ్డలో నీటిని నిల్వ చేయడం వల్లే ప్రాజెక్ట్ కూలడానికి కారణమని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పాడిన తర్వాత రూ.87,449 కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్ అర్థాంతరం కుంగిపోవడం, నిరుపయోగంగా మారడం దారుణమన్నారు. సరైన ప్రణాళికలతో కట్టకపోవడం వల్లే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్ట్ నిరూపయోగంగా మారాయని చెప్పారు.

‘‘ప్రాణహిత-చేవెళ్ల పేరు మార్చి కాళేశ్వరం అన్న పేరు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు గుండెకాయలాంటి మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను దెబ్బతిన్నది. మూ బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగంగా మారాయి. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్లను ఆనాటి సీఎం మార్చారని కమిటీ తెలిపింది. మేడిగడ్డలో బ్యారేజీ నిర్మించవద్దని వ్యాప్కోస్ నిపుణులు చెప్పారు. రూ.33వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్లను పక్కనబెట్టి.. రూ.1.47 లక్సల కోట్లతో కాళేశ్వరం మొదలు పెట్టారు. కానీ ఆ ప్రాజెక్ట్ ద్వారా 2019 నుంచి 2023 మధ్య అంటే ఐదేళ్ల కాలంలో ఆ ప్రాజెక్ట్‌తో లిఫ్ట్ చేసిన నీరు 162 టీఎంసీలు మాత్రమే’’ అని వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

‘‘సంవత్సరానికి 20.2 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. బ్యారేజీలకు జరిగిన నష్టం రాష్ట్రానికి పెనుభారంగా మారింది. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేదీ ప్రాజెక్ట్. స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి విపత్తు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు భారత రాష్ట్రసమితి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎన్‌డీఎస్‌ఏపై భారత రాష్ట్రసమితి నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బిల్లు తెచ్చినప్పుడు భారత రాష్ట్ర సమితి మద్దతిచ్చింది’’ అని ఆయన వివరించారు.

Tags:    

Similar News