బధిరులకు కరీంనగర్ జిల్లా అధికారుల బాసట, ఏం చేశారంటే...

దివ్యాంగులైన చెవిటి,మూగ, అంధులు, అంగవైకల్యం కలవారి సమస్యలను తీర్చేందుకు కరీంనగర్ జిల్లా అధికారులు నడుం కట్టారు.;

Update: 2025-07-25 09:50 GMT
సైన్ లాంగ్వేజ్ లో శిక్షణ పొందుతున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అధికారులు

దివ్యాంగులైన మూగ, చెవిటి, అంధులు, అంగవైకల్యం కల ప్రజల సమస్యలను తెలుసుకొని వారి సమస్యలు తీర్చాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి నిర్ణయించారు. దీనిలో భాగంగా తనతోపాటు జిల్లా అధికారులకు, దివ్యాంగుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ అంతరాన్ని తగ్గించేందుకు బధిరులు మాట్లాడే సైన్ లాంగ్వేజ్ లో కరీంనగర్ జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా అధికారులంతా శిక్షణ పొందారు.


బధిరులతో మాట్లాడి, వారి సమస్యలను అవగాహన చేసుకొని వాటిని పరిష్కరించేందుకు వీలుగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సహకారంతో కరీంనగర్ లో బధిరుల భాష అయిన సైన్ లాంగ్వేజ్ లో వారం రోజుల శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. రోజుకు రెండు సెషన్లలో కలెక్టరుతోపాటు జిల్లా అధికారులు సైగల భాషలో శిక్షణ పొందుతున్నారు.



 అంధులు, బధిరుల సమస్యలు తెలుసుకొని వాటిని సానుభూతిలో పరిష్కరించాలనే లక్ష్యంతోనే సైన్ లాంగ్వేజ్ లో తాము శిక్షణ పొందుతున్నామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. సైగల భాషను నేర్చుకోవడం ద్వారా దివ్యాంగుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే అవకాశం ఏర్పడిందని కలెక్టర్ పేర్కొన్నారు.




 కరీంనగర్ జిల్లాలోని అంధులు, చెవిటివారి పాఠశాలలు, దివ్యాంగుల భవిత కేంద్రాలను అధికారులు సందర్శించి వారితో నేరుగా నేర్చుకున్న సైగల భాషలో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల పట్ల గౌరవం ఇవ్వాలని, కోరారు. వచ్చే నెలలో పాఠశాల సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, పునరావాస కార్మికుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని కలెక్టరు సూచించారు. అధికారులు మానవత్వంతో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరు ఆదేశించారు.



Tags:    

Similar News