మంత్రి పదవి ముఖ్యంకాదు..నన్ను అవమానిస్తున్నారు

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నానని ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి;

Update: 2025-08-11 10:12 GMT

మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంగా సీఎం రేవంత్ , కాంగ్రెస్ నేతలపై కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట మార్చారు.తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రభుత్వం అవినీతిరహిత పాలనను అందించాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సత్వరం నెరవేర్చాలని సూచించారు.తెలంగాణ సమాజం ఆకాంక్షలు నెరవేర్చేలా కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ఉండాలని ఆకాంక్షించారు.

తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, ఇది వాస్తవమని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే ఇందులో వాస్తవాన్ని ప్రజలకు వివరించిన భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీలో చేరేముందు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట నిజమేనని , మంత్రివర్గ కూర్పులో అది సాధ్యం కాలేదని తాజాగా భట్టి వెల్లడించారు. భట్టి మాటలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని ట్వీట్ చేశారు.అయితే ఆ హామీని అధిష్ఠానం అమలుచేయలేదని వాపోయారు. ఈ విషయంలో తనను రాష్ట్రంలోని ముఖ్య నేతలే అడ్డుకుంటూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News