Konda Surekha | కేటీఆర్‌కు జైలు తథ్యం.. కొండా సురేఖ ఆశీర్వాదం..!
మాటకొస్తే జైలు కెళ్తా అంటున్న కేటీఆర్ కోరికకు మంత్రి కొండా సురేఖ తథాస్తు వచనాలు పలికారు.
మాటకొస్తే జైలు కెళ్తా అంటున్న కేటీఆర్(KTR) కోరికకు మంత్రి కొండా సురేఖ(Konda Surekha) తథాస్తు వచనాలు పలికారు. జైలుకు వెళ్లడానికి తొందర అవసరం లేదని, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ అక్కడే వెళ్తారంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారామే. తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఇటీవలి కాలంలో పెరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందరో విద్యార్థులు అశువులు బాశారని, అయినా వారి కుటుంబాలకు కనీసం పరామర్శించిన పాపాన కూడా పోని ఈ నేతలు ఇప్పుడు వచ్చి విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామని అనడం.. దయ్యాలు వేదాలు వల్లెవేయడం తరహాలో ఉందంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో నాశనం తప్ప అభివృద్ధి, సంక్షేమం అన్న కనిపించిన దాఖలాలు లేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రైలు ప్రమాదంలో విద్యార్థులు మరణిస్తే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కన్నీటి బొట్టైనా రాల్చారా..? అని ప్రశ్నించారామే. జైలు నుంచి కవిత బయటకొచ్చినప్పటి నుంచి కేటీఆర్‌కు భయం పట్టుకుందంటూ సెటైర్లు వేశారు.
ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర
‘‘సైకోరావు నేడు ప్రభుత్వం పైన అవసర ఆరోపణలు చేస్తున్నారు. 10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ నేతలు ఆ సమయంలో ఏ గురుకుల్లోకి వెళ్లి విద్యార్థుల పరిస్థితులను చూడలేదు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ అంశంపై రాజకీయ దుర్దేశంతో మాట్లాడుతున్నారు. విద్యార్థులు ఇబ్బందులపై కూడా రాజకీయం చేస్తున్నారు. వాంకిడి విద్యార్థిని శైలజ మరణించడం చాలా బాధాకరం. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటివి చాలా సంఘనటలు జరిగినా వారు పట్టించుకోలేదు. మూసీ, ఫార్మా విషయంలో కూడా గిరిజనులను అడ్డుపెట్టుకొని కావాలనే కలెక్టర్‌ను చంపడానికి ప్లాన్ చేశారు. శాంతి భద్రత సమస్యలను సృష్టించింది తెలంగాణకు పెట్టుబడులు రాకుండా చేసేందుకు చూస్తున్నారు’’ అని ఆరోపించారు.
ప్లాన్ ప్రకారమే అన్నీ చేస్తున్నారు..
‘‘సిరిసిల్ల కలెక్టర్‌ను ఉద్దేశించి సైకోరావు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్ ప్రజల ఉసురు పోసుకున్నారు మీరు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లులపై లాఠీ ఛార్జ్ చేశారు. కావాలనే ప్లాన్ చేసి అన్నీ చేయిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిదీ పరిగణనలోకి తీసుకొని విచారణ చేస్తుంది. తప్పు ఎవరు చేసిన ఊరుకోదు. గత 10 ఏళ్లలో ఎవరిని కలవని కేటీఆర్ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావ్’’ అని ప్రశ్నించారు.
కేటీఆర్ మానసిక పరిస్థితి బాలేదు
‘‘ఈ మధ్య కాలంలోనే కవిత.. జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి కేటీఆర్‌కు టెన్షన్ పట్టుకుంది. హరీష్ రావు, కవిత ఏదో పదవులు ఇస్తారు అని మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గురుకుల సెక్రటరీగా పని చేసి కోట్ల కుంభకోణం చేశారు. బాల్క సుమన్, కిషోర్ ఆ సమయంలో వారిపై కామెంట్ చేశారు. గత ప్రభుత్వo ప్రవీణ్ కుమార్‌పై విచారణ చేయలేదు. ఫుడ్ పాయిజన్ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రమేయం ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనను సైకో రావు నడుపుతున్నారు అని నేను నమ్ముతున్నా’’ అని కీలక ఆరోపణలు చేశారు.
‘‘ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో మాఫీయా నడిపారు. గతంలో జరిగిన తరహాలో అన్యాయాలు, అక్రమాలు జరుగకుండా పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించటానికి టెండర్ ప్రక్రియ ద్వారా సరకులు అందిస్తున్నాం. కేటీఆర్ తన గురుంచి పాట పాడితే రూ.10 లక్షలు ఇచ్చాడు. నాడు ఎంతో మంది విద్యార్థులు చనిపోతే కనీసం స్పందించలేదు. అధికారం కోల్పోవడంతో ఏడాదిలోనే కేటీఆర్‌కి పిచ్చి పట్టింది. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంకా 4 సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉంటది. నెక్ట్ కూడా మా పార్టీనే అధికారంలోకి వస్తది. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ. ప్రతిపక్ష పార్టీలు సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ లేనిపోని ఆరోపణలు చేయకూడదు. కేటీఆర్ నేను జైలుకి పోతా అని నిద్రలో కూడా కలువరిస్తవున్నాడు అనుకుంట.. సమయం వచ్చినప్పుడు అందరూ పోతారు మీ చెల్లికి వచ్చినప్పుడు పోలేదా? ఊరికే అడగకు’’ అని అన్నారు.