కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసు

అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తనపై అసత్య ఆరోపణలు చేసి మంత్రి కొండా సురేఖకు పరువునష్టం కలిగించారని,మంత్రికి కేటీఆర్ లీగర్ నోటీసులు పంపించారు.అమల దీనిపై స్పందించారు.

Update: 2024-10-03 01:06 GMT

కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ తరపున ఆయన న్యాయవాది లీగల్ నోటీసులు పంపించారు.పీవీ జననీ అసోసియేట్స్ న్యాయవాది మంత్రికి ఈ నోటీసులు పంపించారు. కేవలం తన గౌరవానికి తన ఇమేజికి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత- నాగచైతన్య పేర్లను తీసుకుంటూ కొండ సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో పలువురి ప్రతి వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ దుమారం రాజుకుంది.




 అక్కినేని అమల రాహుల్, ప్రియాంకలకు ఫిర్యాదు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అమల స్పందించారు.మంత్రి వ్యాఖ్యలు చూసి నేను షాక్ కు గురయ్యానని అమల తెలిపారు. మహిళా మంత్రి దెయ్యంలా వ్యవహరించి దారుణ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అమల ఆరోపించారు. ‘‘ఒక మహిళా మంత్రి తన స్వార్థ రాజకీయాల కోసం అబద్ధపు ఆరోపణలు చేయడం దారుణం, రాహుల్ గాంధీ గారూ నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? దయచేసి మీ నాయకులను అదుపులో ఉంచుకోండి. సందరు మంత్రి నా కుటుంబానికి తక్షణమే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి’’అని అమల ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఎక్స్ పోస్టును రాహుల్, ప్రియాంక గాంధీలకు ట్యాగ్ చేశారు.

Tags:    

Similar News