KTR కేటీఆర్ ను అరెస్టు చేయాల్సిందే
కీలకసూత్రదారుడు కేటీఆర్ (KTR)ను అరెస్టు చేయాల్సిందే అని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామసభలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Pratik Jain) మీద జరిగిన దాడిలో కీలకసూత్రదారుడు కేటీఆర్ (KTR)ను అరెస్టు చేయాల్సిందే అని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు. పార్టీ ఆఫీసు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతు లగచర్ల(Lagacharla) ఘటనలో కేటీఆరే మొదటి ముద్దాయని బొమ్మ చెప్పారు. మామూలుగా గ్రామస్తులు లేదా రైతులు అయితే కలెక్టర్ మీద దాడిచేసేంత సాహసం చేయరని అధ్యక్షుడు స్పష్టంచేశారు. కలెక్టర్ మీద దాడి ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారమే జరిగిందని తేల్చేశారు. గ్రామసభలో పాల్గొన్న వారిలో భూములు లేని వారు, రైతులు కాని వారు ఎందుకు హాజరయ్యారని బీఆర్ఎస్ ను బొమ్మ నిలదీశారు. రైతులు కాని వారికి, అసలు భూములే లేనివారికి గ్రామసభలో ఏమిపని అని ప్రశ్నించారు.
రైతులు, గ్రామస్తుల ముసుగులో కొందరు బీఆర్ఎస్ ప్రేరేపిత వ్యక్తులు చేరిపోయి దాడులు చేసిన విషయం పోలీసుల విచారణలో బయటపడిందని బొమ్మ గుర్తుచేశారు. స్ధానిక నేత సురేష్ తో మాజీ ఎంఎల్ఏ పట్నం నరేందరరెడ్డి(Patnam Narendar Reddy) ఫోన్లో చాలాసార్లు మాట్లాడిన విషయం బయటపడిందన్నారు. పట్నం+కేటీఆర్ ప్లాన్ ప్రకారమే సురేష్ సంబంధంలేని కొందరు వ్యక్తులను గ్రామసభకు తీసుకెళ్ళి కలెక్టర్ పైన దాడి చేయించిన విషయం బయటపడిందన్నారు. కాబట్టి పట్నం ద్వారా సురేష్ ను దాడికి ప్రోత్సహించింది, ప్లాన్ చేసిన కేటీఆర్ మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని బొమ్మ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తీసుకున్న ప్రతినిర్ణయాన్ని బీఆర్ఎస్(BRS) నేతలు వ్యతిరేకిస్తు జనాలను రెచ్చగొడుతున్నట్లుగా బొమ్మ ఆరోపించారు. జలవనరులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. బాధితులను రెచ్చగొడుతు ప్రభుత్వం, హైడ్రా(Hydraa) మీదకు బీఆర్ఎస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. మూసీనది(Musi River) పునరుజ్జీవనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించగానే కేటీఆర్, హరీష్ ఎంతగా వ్యతిరేకిస్తున్నారో బొమ్మ గుర్తుచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టడమే కేటీఆర్, హరీష్ రావు తదితరులు పనిగా పెట్టుకున్నట్లు బొమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వాళ్ళపై ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని, తీసుకోవాల్సిందే అని బొమ్మ డిమాండ్ చేశారు.