‘ఫార్ములా ఈ రేస్ కేసులో కెటిఆర్ అరెస్ట్ తప్పదు’
పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోస్యం
ఫార్ములా ఈ రేస్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ అరెస్ట్ తథ్యమని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ కేసులో కెటిఆర్ ప్రధాన నిందితుడు అని ఆధారాలు వెల్లడయ్యాయి. కవితది తండ్రి సంపాదించిన ఆస్తుల కోసం జరుగుతున్న గొడవ అని ఆయన వ్యాఖ్యానించారు. బిసీ ప్రజలు కవితను నమ్మనే నమ్మరని ఆయన అన్నారు. ప్రజల్లో ఇమేజి లేని కవిత.. ఆస్తుల కోసమే రాజకీయాలు చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది సర్వేలో తేలుతుందన్నారు. అక్టోబర్ నాలుగో తేదీన తెలంగాణలో 22మంది కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లు పర్యటిస్తారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై బిజెపికి చిత్తశుద్ది లేదన్నారు. బిసీ బిల్లును ఆమోదించకుండా కేంద్రమే తాత్సారం చేస్తుందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు ఆధారాలు వెల్లడయ్యాయన్నారు. తాను అప్పటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డితో రెండున్నర ఏళ్లు జరిపిన సంభాషణను బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగచాటుగా విన్నదని ఆరోపించారు.