లిక్కర్ స్కాం కేసు హైదరాబాద్, విశాఖలలో సిట్ సోదాలు

జగన్ సన్నిహితుడి కంపెనీల్లో సీట్ అధికారుల తనిఖీలు;

Update: 2025-09-11 09:32 GMT

ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేసారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సునీల్ రెడ్డికి చెందిన పది కంపెనీలకు గాను ఐదు కంపెనీలలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖలలో ఏకకాలంలో సిట్ బృందం ఈ దాడులు నిర్వహిస్తోంది.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3 -స్నేహా హౌస్, బంజారాహిల్స్ - రోడ్ నెంబర్ - 2- సాగర్ సొసైటీ, కాటేదాన్ - రాజేందర్ నగర్, ఖైరతాబాద్ - కమలాపురి కాలనీ - ఫేజ్ వన్‌లో ఉన్న కార్యాలయాల్లో లిక్కర్ స్కాం కు సంబంధించిన కేసులో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే వాల్తేర్ రోడ్ - వెస్ట్ వింగ్ - విశాఖపట్నంలో ఉన్న మరో కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని 8 కంపెనీలకు గానూ 4 కార్యాలయాలు, విశాఖపట్నంలోని రెండు కంపెనీలకు గాను ఒక కార్యాలయం సునీల్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు . అందుకే ఈ ఐదు ఆఫీసులలో తనిఖీలు జరుగుతున్నాయి.
ఆర్ ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్‌ఫ్రా కాన్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ కార్ట్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సీస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రెడింగ్ పేరున సునీల్ రెడ్డి కంపెనీలు నిర్వహిస్తున్నారు . లిక్కర్ స్కాంలో చేతులు మారిన సొమ్ము సునీల్ రెడ్డి కంపెనీలకు కూడా చేరిందన్న అనుమానంతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా హైదరాబాద్ శివార్లలో ఫాంహౌస్ లలో తనిఖీలు నిర్వహించిన సిట్ అధికారులు 11కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్ము ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి కి చెందినవిగా అప్పట్లో అధికారులు ప్రకటించారు.అయితే ఆ సొమ్ముతో తనకు సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి వాదిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇతరులకు చేరిన డబ్బు లావాదేవీలపై దృష్టి పెట్టిన సిట్ బృందం తాజాగా నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలలో సోదాలు నిర్వహిస్తోంది.ఈ సోదాలలో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరిస్తుందనేది చూడాల్సి వుంది.
Tags:    

Similar News