లైవ్ సెక్స్ బూతు వీడియోలతో కచ్చా దందా
అంబర్ పేటలో పోర్న్ వీడియోలు చేస్తున్నజంట;
పవిత్ర భార్యభర్తలు బంధాన్ని చెరిపేసిన వార్త ఇది. హైద్రాబాద్ అంబర్ పేటలో ఇద్దరు భార్య భర్తలు తమ సెక్స్ వీడియోలను కస్టమర్లకు షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వినడానికే జుగుప్సాకరంగా ఉన్నప్పటికీ ఈ దంపతులు తమ ఇంట్లోనే పరదాలు కట్టుకుని రాసలీలల వీడియోలు చేసేవారు.
యుపిఏ చెల్లింపులతో వ్యాపారం
తర్వాత యుపిఏ చెల్లింపులు స్వీకరించే వారు. ఫోన్ పే, గూగుల్ పే నెంబర్లకు యుపిఏ చెల్లింపులు చేయగానే తమ వీడియోలు షేర్ చేసేవారు. ఈ నోటా ఆ నోటా పోలీసులకు సమాచారమందింది. ఈ దంపతులు స్వీటీ కపుల్ 2027 పేరిట వీడియోలు చిత్రీకరించేవారు.ఈ వీడియోలను తమ కస్టమర్లకు వెంటనే అమ్మేసేవారు. గత ఆరు నెలల నుంచీ ప్రతీరోజూ కొత్త వీడియోతో కస్టమర్లకు దర్శన మిచ్చేవారు. మా వీడియోలు వెంటనే కావాలంటే యుపిఏ చెల్లింపులు చేయాలని చెప్పేవారు.ఈ క్రమంలో కస్టమర్ల సంఖ్య పెరిగిపోయింది. వీక్షకుల సంఖ్య పెరిగిపోవడంతో వారి వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా సాగింది. ఈ సమయంలోనే పోలీసులకు సమాచారమందడంతో నేరం జరుగుతున్న ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. కెమెరా, లైవ్ లింక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంబర్ పేట పోలీసులు వారిని అదుపులో తీసుకుని ఐటి యాక్ట్ క్రింద కేసు నమోదు చేశారు.