హైదరాబాద్ మెట్రో కు L&T గుడ్ బై ?

నష్టాల వస్తూండటంతో పాటు, ఫేజ్ టు తో సమస్యలు కారణం;

Update: 2025-09-14 04:03 GMT

హైదరాబాద్ మెట్రో నుంచి ప్రధాన  భాగస్వామి ఎల్ అండ్ టి (L&T) వైదొలగాలనుకుంటున్నది. మెట్రో రైలు నిర్వహణలో నష్టాలు వస్తూ ఉండటం, రుణభారం పెరిగిపోతూ ఉండటంతో పాటు, త్వరలో రానున్న మెట్రో రెండో దశ నిర్వహణ తీసుకువచ్చే సమస్యల కారణంగా మెట్రో నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నది.

ఈ విషయాన్నిపట్టణ వ్యవహారాల, హౌసింగ్ శాఖ కు ఒక  లేఖ రాసింది. మెట్రో రెండో దశని రాష్ట్ర ప్రభత్వమే నిర్వహించాలనుకుంటున్నది. అపుడు ఎల్ అండ్ టి నిర్వహణలో ఉన్న మెట్రో మొదటి దశ స్టేషన్ల తో  ప్రభుత్వ నిర్వహణలో ఉన్న రెండో దశ స్టేషన్లతో అను సంధానించడం కష్టమవుతుంది. అదే విధంగా రెండు రకాల టికెట్లుల అమలులోకి వస్తాయి. ఇందంతా పెద్ద తలనొప్పి. అసలే నష్టాలతో ఉన్న ఎల్ అండ్ టి కష్టాలను ఇది మరింత జటిలం చేస్తుంది. అందువల్ల మెట్రో వదిలేసుకోవాలనుకంటున్నట్లు రాష్ట్రానికి లేఖ ద్వారా తెలియ చేసిందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రాసింది.

మెట్రో నిర్వహణ వల్ల నష్టాలను భరించేందుకు ఎల్ అండ్ టి ప్రతి మూడు నెలలకు రు 250 కోట్ల నుంచి 300 కోట్లా దాక అందిస్తున్నది. అంటే సంవత్సరానికి రు. 1200 కోట్లు భరిస్తున్నది. టికెట్ల వల్ల, అడ్వర్టయిజ్ మెంట్ల వల్ల వస్తున్న రెవిన్యూతో మెట్రో రైలు ని నడపగలగుతున్నా,  మెట్రో నిర్మాణానికి తెచ్చిన అప్పు మీద వడ్డి తీర్చడం కష్టంగా ఉంది.దానికి తోడు  ఇది 10 శాతం అధికవడ్డీ రుణం. ఈ భారాన్ని  2017 నుంచి భరిస్తున్నకంపెనీ ముందుముందు రెండో దశ నుంచి వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని మెట్రోరైలును వదిలించుకుంటే పోలా అని భావిస్తున్నది.

ఇప్పటికి వరకు మెట్రో కు  రు.6600 కోట్ల  అప్పు ఉంది. కోవిడ్ సమయంలో సుమారు 169 రోజులు మెట్రో మూసేయడంతో రు.382 కోట్ల నష్టం వచ్చింది. ప్రాజక్టు పూర్తికాగానే 2017 లోనే తనకు రు. 3756 కోట్లు సాయం కావాలని, రుణవిముక్తి కల్గించండని ఎల్ అండ్ టి ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. బిఆర్ ఎస్ హయాంలో కొంత తక్కువ రుణం వడ్డీ అందిచారు.  ఎల్ అండ్ టి రు. 3 వేల కోట్లుఅడిగితే వేయి కోట్లు అందించారు. ఆతర్వాత ఆ వ్యవహారం ముందుకు సాగలేదు.

ఇపుడేమో రెండో దశని ప్రభుత్వమే  నిర్వహించాలనుకుంటున్నది. ఇది ఆచరణ సాధ్యం కాదని ఎల్ అండ్ టి భావిస్తున్నది.

రెండో దశ మొదలయితే, మొదటి దశ కార్నర్ స్టేషన్లయిన రాయదుర్గం, మియాపూర్, నాగోల్, ఎంజిబిఎస్ స్టేషన్ లు రెండో దశలో భాగమవుతాయి. అక్కడ సమస్య అవుతుంది. రెండు వేర్వేరు కంపెనీల రైళ్లు నడుస్తాయి. రెండు వేర్వేరు టికెట్ల అమలులోకి వస్తాయి. వేర్వేరు ధరలుంటాయి. ఇది నిర్వహణలో కొత్త కష్టాలను తీసుకవస్తుందని ఎల్ అండ్ టి ప్రతినిధులు చెబుతున్నారు.

ప్రభుత్వం రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


Tags:    

Similar News