మలయాళ నటుడు వినాయకన్ హైదరాబాద్ లో అరెస్టు
తాగిన మత్తులో విమానంలో న్యూసెన్స్ సృష్టించాడని ఆరోపణ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మలయాళం నటుడు వినాయకన్ ని అరెస్ట్ చేశారు. ఆయన. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తున్నట్లు సమాచారం. ఇండిగో విమానంలో వచ్చిన వినాయక్ మద్యం మత్తులో విమానంలోని ప్రయాణికుల పట్ల అసభ్యకర ప్రవర్తన చేసినట్లుతెలిసింది. ఈ విషయాన్ని సిఐఎస్ఎఫ్ అధికారులకు కొంతమంది ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీనితో వినాయకన్ ను అదుపులోకి సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన సిఐఎస్ ఎఫ్ అధికారులతో కూడా దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎయిర్ లైన్ గేట్ స్టాఫ్ తో అతన దురుసుగా ప్రర్తించడంతో మొదట గొడవ ప్రారంభమయింది. తర్వాత అతన్ని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. వినాయక పై కేసు నమోదు చేస పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. అయితే, అకారణంగా తనని సిఐఎస్ ఎఫ్ అధికారులు తనమీద చేయిచేసుకున్నారని తన ప్రవర్తన ఏమిటో సిసిటివి లు వెరిఫై చెక్ చేసుకోవచ్చని ఆయన వాదించినట్లు తెలిసింది. తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం, న్యూసెన్స్ సృష్టించడం వంటి ఆరోపణల మీద ఆయన కేసులునమోదచేసినట్లు సిఐ ఎయిర్ పోర్ట్ పిఎస్ బాల్ రాజ్ తెలిపారు.