‘బీసీల గురించి కవితకు తెలియదు’
బీసీల రాజకీయాన్ని నిలువరించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.;
కవిత, తీన్మార్ మల్లన్న వివాదం ప్రస్తుతం తెలంగాణ మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఇది ఎంత దూరం పోతోందో అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న సోమవారం.. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌ను కలిశారు. కవితపై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కార్యాలయంపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగానే తనపై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనన్నారు. ‘‘నా కార్యాలయంలో కవిత అనుచరులు సృష్టించిన విధ్వంసంపై కాసేపట్లో డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తాం. కవితపై ఎథిక్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశాం. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరాం. అదే విధంగా నాకు రక్షణ కల్పించాలని కోరాను. బీసీల కట్టుబాట్లు, పదజాలం ఏంటో కవితకు తెలియదు. బీసీల రాజకీయాన్ని నిలువరించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు’’ అని మల్లన్న అన్నారు.