కేటీఆర్ కు జూపల్లి సవాల్

పాలమూరు రంగారెడ్డిపై కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

Update: 2025-09-29 11:58 GMT

పాలమూరు రంగారెడ్డిపై కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని కేటీఆర్ కు జూపల్లి సవాల్ విసిరారు.నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాష్ట్ర రాజకీయాలు అట్టడుకుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్ అయినా హరీష్ రావు అయిన చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తా అని అన్నారు. లేదంటే మీరు రాజీనామా చేస్తారా..అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు.

తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని ,ఏం మాట్లాడానో పూర్తి వీడియో చూస్తే తెలుస్తుందని జూపల్లి స్పష్టం చేశారు. కేటీఆర్ చర్చకు వస్తే,పూర్తి వీడియో చూపిస్తా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు రూ.8 లక్షల కోట్లు బాకీ ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పులి పంజా విసిరితే బీఆర్ఎస్ గద్దే దిగిందని మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.లేనిపోని వ్యాఖ్యలు ,విమర్శలు చేస్తూ రాజకీయాలు చేస్తామంటే కుదరదని జూపల్లి స్పష్టం చేశారు.
Tags:    

Similar News