జగిత్యాల లో పరువు హత్య
ప్రేమించిన పాపానికి బలితీసుకున్నారు
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేపల్లె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎదురుగట్ల సతీష్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దల సమక్షంలో వీరిరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నించారు. డ్రైవర్ గా పనిచేస్తున్న సతీష్ కు ఇచ్చి పెళ్లి చేయడానికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయినా వీరి ప్రేమాయణం కొనసాగింది. సతీష్ ను అనేక పర్యాయాలు హెచ్చరించినప్పటికీ వినిపించుకోలేదు. ఇన్ స్టా గ్రామ్ లో వీరి ప్రేమాయణం గూర్చి సతీష్ ప్రచారం చేసుకున్నాడు. యువతితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
యువతికి పెళ్లి చేద్దామని డిసైడ్ అయిన కుటుంబ సభ్యులు ఓ సంబంధం ఖాయం చేశారు. ఈ విషయం సతీష్ కు తెలిసింది. ఇన్ స్టాగ్రామ్ లో తాను ప్రేమించిన యువతిని ఎవరూ పెళ్లి చేసుకోవద్దని పోస్ట్ పెట్టాడు.దీంతో యువతి కుటుంబసభ్యులు సతీష్ ను చంపాలని డిసైడ్ అయ్యారు. శనివారం రాత్రి సతీష్ ఇంటికి వెళ్లి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సతీష్ తలకు తీవ్ర రక్త స్రావమైంది. సతీష్ చనిపోవడంతో హత్య కేసు నమోదైంది. నథారి వినంజీ, శాంతి వినంజీ, జలాల్ఫైలు ఈ కల్సి హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు.నిందితుల కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి.