దివ్యాంగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్.. వారికి ఆ అవసరం ఉండదంటూ..

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క.. దివ్యాంగులను ఉద్దేశించి ప్రసంగించారు.

Update: 2024-10-14 09:39 GMT

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క.. దివ్యాంగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపై ఉద్యోగాల కోసం దివ్యాంగులకు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వారు కేవలం ఈ పోర్టల్‌లో జాబ్ కోసం అప్లై చేసుకుంటే సరిపోతుందని, వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయిన ఆమె వివరించారు. ఉద్యోగాల కోసం దివ్యాంగులు పడుతున్న కష్టాలను తీర్చడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ఆమె వివరించారు. సచివాలయంలో వికలాంగుల జాబ్ పోర్టల్‌ ఆవిష్కరించిన అనంతరం మంత్రి సీతక్క.. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరేట్ హెల్ప‌లైన్‌లో పది మందికి నియామక పత్రాలు అందించారు. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉంటాయని, దాని వల్ల ఉద్యోగం లభించిక వారు ఎంతో ఇబ్బంది పడుతుంటారని, దానిని తమ ప్రభుత్వం గ్రహించి, దాని పరిష్కారంగానే ఈ పోర్టల్‌ను తీసుకురావడం జరిగిందని వివరించారామే.

ప్రవేటు రంగంలో రిజర్వేషన్లు

‘‘దివ్యాంగులు సమాజంలో ప్రతి రోజూ అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొంటున్నారు. ఇతర వర్గాల వారిలా న్యాయం కోసం పోరాటం చేయాలన్నా వారికి ముందు ఎన్నో సవాళ్లు ఉంటున్నాయి. శారీరిక లోపం అనేది మన చేతిలో లేనిది. పోషకాహారా లోపం, ప్రమాదాల వల్ల వికలాంగులు మారే ప్రమాదం ఉంది. అందుకే వాళ్లకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ ప్రారంభించాం. ప్రైవేటు రంగాల్లో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటించాల్సి ఉంది. ఆ దిశగా కూడా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. దాంతో పాటుగా సంక్షేమ నిధుల్లో ఐదు శాతాన్ని దివ్యాంగులకు కేటాయిస్తుంది ప్రభుత్వం. ప్రవేట్ రంగాల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాల్లో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. వారికి ఉన్న లోపాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని ముందుకు తీసుకురావడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు మంత్రి సీతక్క.

అన్ని రంగాల్లో చేయూత

‘‘దివ్యాంగులకు విద్య, ఉద్యోగ రంగాల్లో చేయూతనందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించాం. అదే విధంగా దివ్యాంగులు తమకున్న సమస్యలను నేరుగా చేయొచ్చు. ఒక్క మెసేజ్‌తో సమస్యలు తీరుతాయి. బ్యాక్ లాగ్ పోస్టులను కూడా అతి త్వరలోనే భర్తీ చేస్తాం. ఇప్పటికే వాటి భర్తీ ప్రక్రియను ప్రారంభించాం. అవకాశాలను బట్టి ఏ రంగంపై ఆసక్తి ఉంటే ఆ రంగంలోకి వెళ్లాలి. ఈ ఆన్‌లైన్ పోర్టల్ సహాయంతో ఎన్నో సంస్థల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దానిని బట్టి ఉద్యోగాలే మీ దగ్గరకు వస్తాయి’’ అని చెప్పారామే.

Tags:    

Similar News