కేసీయార్ బూతులు అధికారభాష అయ్యిందా ?

కేసీయార్ భాషపై మంత్రి సీతక్క ఫుల్లుగా ఫైరయ్యారు. మీడియాతో సీతక్క మాట్లాడుతు బూతులను అధికారిక భాషగా మార్చిందే కేసీయార్ అంటు ఎద్దేవాచేశారు

Update: 2024-04-25 12:44 GMT
Seethakka and KCR

కేసీయార్ భాషపై మంత్రి సీతక్క ఫుల్లుగా ఫైరయ్యారు. మీడియాతో సీతక్క మాట్లాడుతు బూతులను అధికారిక భాషగా మార్చిందే కేసీయార్ అంటు ఎద్దేవాచేశారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పేరుతో సంవత్సరాలతరబడి కేసీయార్ తో పాటు చాలామంది నోటికొచ్చిన బూతులు మాట్లాడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇపుడు కూడా అప్పట్లో మాట్లాడినట్లే కేసీయార్ బూతులు మాట్లాడుతుండటంపై మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో కేసీయార్ బూతులు మొదలుపెట్టేవరకు తెలంగాణా భాష సంస్కారయుతంగానే ఉండేదన్నారు. ఎప్పుడైతే కేసీయార్ నోటికి పనిచెప్పారో అప్పటినుండే భాష పద్దతి మారిపోయిందన్నారు.

ఉద్యమ సమయంలో బూతులు తిట్టిన విషయాన్ని ఇపుడు కూడా కేసీయార్ సమర్ధించుకోవటమే కాకుండా దాన్నే కంటిన్యు చేస్తున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఓడిపోయిన అక్కసంతా రేవంత్ రెడ్డి, మంత్రులను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని సీతక్క ఆక్షేపించారు. ఈమధ్య కూడా కాంగ్రెస్ నేతలను పట్టుకుని కేసీయార్ కుక్కల కొడుకులు అని తిట్టడాన్ని మంత్రి గుర్తుచేశారు. తానేమో నోటికొచ్చినట్లు అందరినీ తిడుతు మళ్ళీ తనను ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం గింజుకుపోతున్నారని చెప్పారు. తెలంగాణా భాషను నాశనంచేసిందే కేసీయార్ అంటు మంత్రి ఫైరయ్యారు. ఎదుటివాళ్ళని బూతులు తిట్టడం ఎందుకు మళ్ళీ వాళ్ళతో తిట్టించుకోవటం ఎందుకని కేసీయార్ ను మంత్రి సూటిగా ప్రశ్నించారు.

Tags:    

Similar News