మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలగిన మిస్ ఇంగ్లాడ్ మిల్లా మాగీ

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తప్పుకున్నారు.పోటీల నుంచి నిష్క్కమించి మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు.;

Update: 2025-05-24 10:46 GMT
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో కీలక ఘటన తాజాగా వెలుగుచూసింది.మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకోవడం సంచలనం రేపింది.మిస్ వరల్డ్ నిర్వాహకులు ధనవంతులైన పురుష స్పాన్సర్ల ముందు తమను కవాతు ప్రదర్శించేలా చేశారని మిల్లా మాగీ ఆరోపించారు.ఈ ఘటన తర్వాత తాను తన గౌరవం కోసం మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్నట్లు మిల్లా పేర్కొన్నారు.


మిస్ వరల్డ్ పోటీదారులంటే వేశ్యలనేలా నిర్వాహకులు ప్రవర్తించారని ఆమె ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు.మిల్లా మాగీ మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకొని ఆమె స్వదేశానికి పయనమై వెళ్లారు.ఈ ఘటనతో మిల్లా మాగీ వార్తల్లో నిలిచారు.




 మిస్ వరల్డ్ పోటీల్లో మరో యూకే సుందరి

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకోవడంతో మిస్ ఇంగ్లాండ్ రన్నరప్ షార్లెట్ గ్రాంట్ మిస్ వరల్డ్ -2025 ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. మిస్ ఇంగ్లాండ్ సంస్థ తాజాగా ఈ మార్పును ధృవీకరించింది.
ఈ విషయంపై మిస్ వరల్డ్ నిర్వాహకుల జట్టు, భారత నిర్వాహకులతో మే 25వతేదీన సమావేశం జరగనుందని ఆతిథ్య దేశానికి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు.“మిస్ బ్రిట్ పోటీ నుంచి నిష్క్రమించడం చాలా దురదృష్టకరం. ఆతిథ్య దేశం, మిస్ వరల్డ్ నిర్వాహకుల జట్టు మే 25 ఉదయం సమావేశాన్ని నిర్వహించి, త్వరలో దీనిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తుందని ఓ అధికారి తెలిపారు.

మిస్ వరల్డ్ సంస్థ ఛైర్‌పర్సన్ జూలియా మోర్లే వివరణ

ఇండియా లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 – మిల్లా మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ ఛైర్‌పర్సన్ జూలియా మోర్లే శనివారం స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మిస్ ఇంగ్లాండ్ మాగీ ఆరోపణలను ఖండించారు.ఈ నెల ప్రారంభంలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు జూలియా మోర్లే తెలిపారు. మిల్లా పరిస్థితిని అర్థం చేసుకొని జూలియా మోర్లే వెంటనే స్పందించి, ఆమె కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించారు. తక్షణమే ఆమెను ఇంగ్లాండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

మిస్ షార్లెట్ గ్రాంట్ వచ్చారు..

మిస్ మిల్లా మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలిగిన తర్వాత మిస్ ఇంగ్లాండ్ 1వ రన్నరప్ అయిన మిస్ షార్లెట్ గ్రాంట్ ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని జూలియా మోర్లే ఈ ప్రకటనలో తెలిపారు. మిస్ షార్లెట్ బుధవారం ఇండియా కు చేరుకున్నారని, మిస్ వరల్డ్ సోదరభావంతో ఆమెను పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించడం జరిగిందని ప్రకటనలో తెలిపారు.

బ్రిటీష్ మీడియాలో తప్పుడు కథనాలు

ఇటీవల బ్రిటీష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై, కొన్ని యూకే మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీల్లో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు, అపవాదకరమైన కథనాలను ప్రచురించినట్లు సంస్థకు తెలియడంతో ఆ ఆరోపణలను ఖండిస్తూ, ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని జూలియా మోర్లే ఆ ప్రకటనలో తెలిపారు.

మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిస్ మిల్లా మాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలు, ఎడిట్ చేయని వీడియో క్లిప్ లను మిస్ వరల్డ్ సంస్థ విడుదల చేసింది. అందులో ఆమె ఆనందాన్ని, కృతజ్ఞతను, ఈ అనుభవాన్ని మెచ్చుకుంటూ మాట్లాడిన దృశ్యాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రచురితమైన తప్పుడు కథనాలు నిరాధారమైనవని, ఆ ఆరోపణలను ఖండిస్తూ జూలియా మోర్లే ఆ ప్రకటనలో వివరించారు.మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, "బ్యూటీ విత్ ఎ పర్పస్" అనే విలువలకు నిబద్ధతతో పోటీలు కొనసాగుతున్నాయని ఆమె వివరించారు.



Tags:    

Similar News