కేటీఆర్‌కు కవిత శుభాకాంక్షలు..

బీఆర్ఎస్‌లో అంతా సర్దుమణిగినట్లేనా..;

Update: 2025-07-24 06:51 GMT

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఈరోజు తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పుడు వీరందరి విషెస్ కన్నా.. కేటీఆర్‌కు ఆయన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విష్ చేయడం అత్యంత కీలకంగా మారింది. కొంతకాలంలో కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు కవిత బర్త్‌డే విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంతా సర్దుమణిగిపోయిందా? కల్వకుంట్ల ఫ్యామిలీ ఒకటైపోయిందా? అన్న చర్చ జోరందుకుంది. ‘‘అన్నయ్య.. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలి’’ అని కవిత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కొంతకాలంగా కవిత, కేటీఆర్ మధ్య కాస్తంత గ్యాప్ నెలకొని ఉంది. కేసీఆర్‌కు అనేక అంశాలను తెలుపుతూ కవిత రాసిన లేఖ బహిర్గతం అయినప్పటి నుంచి కల్వకుంట్ల కుటుంబ కలహాలు బయటపడ్డాయి. ఆ విషయంలో కవిత, కేటీఆర్ ఇద్దరూ కూడా పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా కవిత కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. జాగృతిని బలోపేతం చేయడంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో బీఆర్ఎస్‌లో కేటీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా కవిత ప్రత్యేక జెండాను ఏర్పాటు చేస్తున్నారా? అన్న చర్చలు జరిగాయి. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. అదే సమయంలో కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో కవితకు చురకలంటించారు. దీంతో వీరిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందన్న వాదన గట్టిగా వినిపించింది. పార్టీ పదవుల విషయంలోనే వీరి మధ్య కలహాలు మొదలయ్యాయని అంతా భావించారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా కవిత.. కేటీఆర్‌కు విషెస్ చెప్పడంతో అంతా సర్దుమణిగిపోయిందన్న చర్చ మొదలైంది.

కేటీఆర్‌కు రేవంత్ విషెస్

సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ ఆకాంక్షించారు.

Tags:    

Similar News