శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి.. పార్టీ పిలుపు ఇదే

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-03-15 15:11 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం నుండి ఈడీ అధికారులు బంజారా హిల్స్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలిస్తున్నారు.

ఢిల్లీకి తరలిస్తుండగా కవిత ఇంటివద్ద మోహరించిన పార్టీ శ్రేణులకు ఆమె అభివాదం చేశారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని కవిత అన్నారు. శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అణచివేతను, దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం పైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటామని శ్రేణులకు కవిత ధైర్యం చెప్పారు. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పార్టీ శ్రేణులను సీనియర్ నాయకులు సముదాయించారు.


బ్యాంక్ అధికారుల పంచనామా

కవిత ఇంట్లో సోదాల నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు బ్యాంకు అధికారులు సాక్ష్యులుగా ఉన్నారు. ఢిల్లీ ఈడీ అధికారులు పిలుపు మేరకు పంచనామా నిర్వహించినట్టు వారు ధృవీకరించారు. హైదరాబాద్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ పీ.శ్రీనివాస్ రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ ఆఫీస్ సీనియర్ మేనేజర్ ఎద్దుల వివేకానంద రెడ్డి పంచనామా చేశారు. 




 

కవిత అరెస్టుని ఖండిస్తూ నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..

ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో రాష్ట్రంలో ఆందోళనలు నెలకొన్నాయి. ఆమె అరెస్టుని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆమెని అరెస్టు చేశారంటూ బీజేపీ పై మండిపడుతున్నారు. కవిత అరెస్టు పై ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. "కవిత అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర పన్నాయి రేపు నోటిఫికేషన్ అనగా ఈరోజు అరెస్ట్ చేయడం కుట్ర. సుప్రీం కోర్టులో ఈ అంశం ఉంది. దౌర్జన్యంగా అరెస్టు చేయడం జరిగింది. మా పార్టీ నాయకుల మీద కుట్ర జరిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్య ఇది" అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కవిత అరెస్ట్ నిరసనగా రేపు అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని BRS పార్టీ పిలుపునిచ్చింది.

Tags:    

Similar News