బస్సు ప్రమాదంలో తల్లికూతుళ్లు మృతి
బాధితులు తెలంగాణ మెదక్ జిల్లా కు చెందిన వారే
కర్నూలు బస్సు ప్రమాదంలో తెలంగాణ మెదక్ జిల్లాకు చెందిన తల్లీ కూతుళ్లు దుర్మరణం చెందారు. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన తల్లి సంధ్యారాణి కూతురు చందన మృతి చెందారు. కూతురును బెంగుళూరులో డ్రాప్ చేయడానికి తల్లి సంధ్యారాణి బయలు దేరారు. ఈ క్రమంలోనే బస్సు కర్నూలు వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తల్లీ కూతురు చనిపోవడం ఆ కుటుంబాన్ని కలచి వేసింది. సంధ్యారాణి భర్తతో దుబాయ్ మస్కట్ లో ఉంటోంది.
స్వగ్రామంలో వివాహవేడుకలో పాల్గొనడానికి భార్యాభర్తలు ఇరువురు మెదక్ జిల్లా శివాయిపేటకు చేరుకున్నారు. భర్త ఆనంద్ కుమార్ తిరిగి మస్కట్ వెళ్లిపోయినప్పటికీ జ్వరం కారణంగా సంధ్యారాణి వెళ్లలేకపోయారు. కూతురు చందన బెంగుళూరులో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. డ్రాప్ చేయడానికి సంధ్యారాణి కూతురు చందన వెంట బెంగుళూరు బయలు దేరి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.