తెలంగాణలో వస్తున్న కరువు ‘నీళ్ల బావులు’

వ్యవసాయ రంగంలో ట్రెండ్ అవుతున్న కరువు నీళ్ల బావులు. ప్రతి రైతు చూపు వీటివైపే ఉంది. ఇంతకీ ఈ కరువు నీళ్ల బావులేంటే. వాటినెలా నిర్మిస్తారో చూసేద్ధాం..

Update: 2024-03-08 08:29 GMT
కరువు బావి


కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతు కరువు నీళ్ల బావులు సృష్టించుకుంటున్నాడు. చుక్క చుక్క నీళ్ళని వీటిలొకి పారించి, నింపి, ఆపైన పొలాలకు ఒక్క చుక్క వృథాకాకుండా పారించుకుని పంటను దక్కించుకుంటున్నారు. ఈ కరువు నీళ్ల కృత్రిమ బావి ఇపుడు ఒక వ్యవసాయం లో ఒక ట్రెండ్ అయింది. చిత్రమేమిటంటే, ఈ నీళ్ల కరువు విజృంభించిం నాగార్జున సాగర్ పారుతున్న నల్లగొండ జిల్లాలోలనే బోరుబావిలో నీరు దయనీయ స్థాయిలో పడిపోవటంతో పంటలను రక్షించుకోవటానికి నల్గొండ జిల్లాలోని చందంపేట రైతులు వినూత్న పద్దతే కరువు బావి.

ఇదొక కృత్రిమ గుంత. 'కృతిమ నీటి గుంతలను' ఏర్పాటుచేసుకుని అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా పంటలకు వాడుకుని కరువునుంచి బయటపడేందుకు పోరాటం చేస్తుండటం ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యంకు గురిచేస్తున్నాది. చందంపేట మండలం లోని 20 గ్రామాలు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ కు అతి సమీపంలో ఉన్నాయి, కానీ వీరికి కాలువల ద్వారా వ్యవసాయం కు నీరు అందిచటం లేదు. 1967 సంవత్సరంలో ప్రాజెక్ట్ ప్రారంభించిన దగ్గరి నుంచి నేటి వరకు పాలకులు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ రైతుల పరిస్థితి ఈ నిర్లక్ష్యానికి నిదర్శనం.

తమ కళ్ళ ముందు కృష్ణ నది పరవళ్లు తొక్కుతున్నా, రైతులు బోరు బావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తిన్నారు. నాగార్జున సాగర్ లో నీటి స్థాయిలో రైతుల బోరు బావులపై ప్రభావం చూపుతుంది. 2024 మార్చ్ లో ప్రాజెక్ట్ లో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ లెవెల్ స్థాయి కి పడిపోవటం తో ఈ గ్రామాలలోని బోరు బావులలో నీరు అడుగంటింది. దీన్నుంచి వచ్చిందే ఈ ప్రయోగం. పంటలను కాపాడువటం కోసం నీటి గుంటల ఆలోచన నన్ను ఎంతో ఆశ్యర్యంకు గురిచేసింది, దీని వెనుక అధికారుల, సాంకేతిక నిపుణుల సలహాలు లేవని రైతులు తనతో చెప్పారని నీటి పారుదల శాఖ సహాయ ఇంజనీర్ కే . ప్రవీణ్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు .

రెండు మూడు విధానాలను కలిపి సాగు నీటి సమస్యను పరిష్కరించుకోవటం రైతులు విజయం సాధించారని అయన అన్నారు. రైతులకు ఎలాంటి సలహాలు కావాలన్నా జిల్లా నీటి పారుదల శాఖ సిద్ధంగా ఉందని అయన స్పష్టం చేసారు. ఒక రైతు అనుసరించిన ఈ సాగు పద్దతి , మండలం లోని మిగతా రైతులకు మార్గదర్శకం అయింది అని , తన రెండు బోరు బావులలో నీరు గణనీయ స్థాయిలో పడిపోయి నాలుగు ఎకరాలలోని పత్తిపంటను రక్షించుకోవటానికి 'కృత్రిమ నీటి గుంత" ఉపయోగపడింది అని కాచరాజు పల్లె కు చెందిన రైతు బానోతు శ్రీనివాస్ తెలిపారు.

ఏమిటి “కృతిమ నీటి గుంత” ?
నాలుగు, ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులు రెండు మూడు బోరు బావులను తవ్వించారు. అయితే, ఆ బోరు బావులలో నీరు అడుగంటింది. మోటార్ వేస్తే పంప్ నుండి త్రాగు నీటి నల్లా కంటే సన్నని ధార వస్తుంది. ఈ ధారతో పంట చివరి వరకు నీరందిచటం రైతులు సవాల్ గా మారింది. దీని అధిగమించటానికి రైతులకు వచ్చిన ఆలోచనే కృతిమ నీటి కుంటలు. నీటి అవసరం ఆధారంగా రైతులు తమ వ్యవసాయ భూమిలో ఐదు నుంచి ఏడ అడుగుల లోతులో గుంతను తవ్వి, నీరు ఇంకకుండా ప్లాస్టిక్ షీట్‌ను అడుగుభాగంలో అమర్చుతారు.
తమకున్న బోరు బావుల నుంచి నీటికి దీనిలోకి పంప్ చేస్తారు. మళ్ళీ ఆ గుంతను నుండి నీటిని ప్రెషర్ మోటార్స్ తో డ్రిప్ సిస్టం ద్వారా పొలమంతటికి అందిస్తారు. ఒక బోరు బావి గల ప్రక్క ప్రక్క పొలం లో ఉన్న రైతులు కామన్ గా ఒక నీటి గుంతను ను ఏర్పాటు చేసుకొని, తమ బోరు బావులలో నీటితో దానిని నింపి, అవసరానికి అనుగుణంగా నీటిని వాడుకొంటున్నారు. పంటలను రక్షించుకోటంలో రైతుల ఐఖ్యత కు అద్దం పడుతుంది.

నీటి కొరతను అధిగమిస్తున్న రైతులు
ఒక రైతు అనుసరించిన ఈ సాగు పద్దతి , మండలం లోని మిగతా రైతులకు మార్గదర్శకం అయింది అని , తన రెండు బోరు బావులలో నీరు గణనీయ స్థాయిలో పడిపోయి నాలుగు ఎకరాలలోని పత్తిపంటను రక్షించుకోవటానికి 'కృతిమ నీటి గుంత" ఉపయోగపడింది అని కాచరాజు పల్లె కు చెందిన రైతు బానోతు శ్రీనివాస్ తెలిపారు.
చందంపేట కు చెందిన మరొక రైతు మాడ రమేష్ మాట్లాడుతూ "తాను ఈ పద్దతిని అమలుచేయక పోతే ఈ పాటికి నా ఐదు ఎకరాలలో పంట ఈ పాటికి ఎండిపోయేవి. ఈ పద్దతి వాళ్ళ ఎక్కువ విద్యుత్ అవసరం. ఉచిత విద్యుత్ స్కీం వల్ల రైతులపై ఎలాంటి ఆర్ధిక భారం పడటం లేదు. నీటి కుంటల విధాంకు వ్యవసాయ శాఖ సబ్సిడీ పై కావలసిన మెటీరియల్ అందించాలి. ".
‘వన్ ఎకరా -వన్ క్రాప- వన్ లక్ష’ ఆదాయం నమూనాను అమలుచేసిన ఆదర్శ రైతు నెల్లికంటి రాఘవేందర్ మాట్లాడుతూ "పంట రక్షణకు రైతులు తమ శక్తినంతా వడ్డుతారు, సంఘటితం అవుతారు. చందంపేట రైతుల ప్రయత్నం రాష్ట్రంలోని మిగతా రైతులకు ఆదర్శం కావాలి. వ్యవసాయం శాఖ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నీటి గుంత విధానం పై అవగాహన కార్యక్రమములు నిర్వహించాలి"


Tags:    

Similar News