ఎమ్మెల్యేగా నవీన్ ప్రమాణ స్వీకారం..

Update: 2025-11-26 09:07 GMT

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు. స్వీకర్ కార్యాలయంలో జరిగిన నవీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు, నవీన్ కుటుంబీకులు హాజరయ్యారు. అయితే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దాదాపు 24వేల ఓట్లతో మాగంటి సునీతపై నవీన్ యాదవ్ విజయం సాధించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు ఉపఎన్నికలు జరిగాయి. మొదట కంటోన్మెంట్‌లో జరగగా అక్కడ కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది. మళ్ళీ ఇటీవల జరిగిన జూబ్లీ ఉపపోరులో కూడా ఘన విజయం సాధించింది.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతి పార్టీ తమ సొంత వ్యూహాలతో హోరెత్తించాయి. కాంగ్రెస్ తరుపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరుపున మాగంటి సునీత, బీజేపీ తరుపున లంకల దీపక్ రెడ్డి బరిలో దిగారు. ఈ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అంతా అంచనా వేశారు.

కానీ తీరా ఎన్నికల కౌంటింగ్ రోజున పోస్ట్ బ్యాలెట్ లెక్కింపు దగ్గర నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యంలో నిలిచారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా నవీన్ యాదవ్ విజయం ఖరారు అయిపోయింది. ఆ తర్వాత సాయంత్రం ఆయనకు విజయ పత్రాన్ని కూడా ఎన్నికల అధికారులు సాధించారు. ఉపఎన్నికలో విజయం సాధించిన దాదాపు రెండు వారాలకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

Tags:    

Similar News