అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి మిస్సింగ్

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. నితీషా కందుల అనే విద్యార్థిని లాస్‌ ఏంజిల్స్‌లో తప్పిపోయినట్లుగా పోలీసులు ధృవీకరించారు.

Update: 2024-06-03 12:28 GMT

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. నితీషా కందుల అనే విద్యార్థిని లాస్‌ ఏంజిల్స్‌లో తప్పిపోయినట్లుగా పోలీసులు ధృవీకరించారు. అమెరికా కాలమానం ప్రకారం గత శుక్రవారం రాత్రి నుంచి ఆమె అదృశ్యమైనట్లు తెలుస్తోంది. శాన్‌బెర్నార్డినోలోని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో నితీషా కందుల మాస్టర్స్‌ చేస్తోంది.

కాగా, శుక్రవారం రాత్రి నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొబైల్‌ కు కాల్‌ చేసినా కూడా స్పందించడం లేదు. దీంతో సాయం కోసం వాట్సాప్‌ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. అదృశ్యమైన నితీషా కనిపిస్తే +91 80749 62618 నంబర్‌కు సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


గత నెలలోనే తెలంగాణకి చెందిన విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది (26) చికాగోలో అదృశ్యమయ్యాడు. ఏప్రిల్‌లో, హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ మార్చిలో అదృశ్యమైన తర్వాత క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు.

Tags:    

Similar News