Pawan spots BJP|బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసిన పవన్

అల్లుఅర్జున్(Allu Arjun) విషయంలో పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు మండిపోతున్నారు.;

Update: 2024-12-31 07:24 GMT
Janasena Chief Pawan Kalyan

ఒక్క ప్రకటనతో తెలంగాణ బీజేపీ మొత్తాన్ని సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(pawanKalyan) ఇరకాటంలోకి నెట్టేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రి ఏమిటి తెలంగాణా బీజేపీ(Telangana BJP)ని ఇరకాటంలోకి నెట్టేయటం ఏమిటని ఆలోచిస్తున్నారా ? అల్లుఅర్జున్(Allu Arjun) విషయంలో పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు మండిపోతున్నారు. పుష్ప సినిమా(Pushpa Movie) రిలీజ్ సందర్భంగా అల్లుఅర్జున్ సంధ్యా ధియేటర్(Sandhya Theatre)కు వచ్చినపుడు తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళాడు. ఆ ఘటనను రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నది. అల్లుఅర్జున్ మీద పోలీసులు కేసునమోదు చేయటమే కాకుండ అరెస్టు కూడా చేయటం సినిమా ఇండస్ట్రీలో సంచలనమైపోయింది. ఇదే నేపధ్యంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏ సినిమాకూ బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల రేట్లు పెంచుకోవటాలు ఉండవని రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. రేవంత్ ప్రకటనతో సినిమా ఇండస్ట్రీ(Cinema Industry) మొత్తం కిందా మీదా అవుతోంది. సీఎంతో కొందరు సినీప్రముఖులు భేటీ అయినా ఉపయోగంలేకపోయింది.

అల్లుఅర్జున్ మీద కేసునమోదు చేయటమే కాకుండా అరెస్టు కూడా చేయటాన్ని బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు మండిపోయారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లుఅర్జున్ పైన కేసు ఏమిటి ? అరెస్టు చేయటం ఏమిటని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్(Bandi Sanjay) తో పాటు ఎంపీలు డీకే అరుణ, రఘునందనరావు, ఈటలరాజేందర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అల్లుఅర్జున్ పై రేవంత్ ప్రభుత్వం కుట్రతో కేసు పెట్టిందని, అరెస్టుచేయటం దుర్మార్గమని ఏదేదో మాట్లాడేస్తున్నారు. సరిగా ఇదేసమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకునపెట్టేదిగా ఉంది. దాంతో రేవంత్ తో పాటు పవన్ మీద కూడా కేంద్రమంత్రి బండి సంజయ్ రెచ్చిపోతున్నారు. దీంతోనే పవన్ వ్యాఖ్యలు బీజేపీ నేతలను ఎంతగా మండించిదో అర్ధమైపోతోంది.

ఇంతకీ పవన్ ఏమన్నారంటే తొక్కిసలాటలో అల్లుఅర్జున్ దే తప్పుందన్నట్లుగా చెప్పారు. తొక్కిసలాట గురించి పవన్ మాట్లాడుతు ‘ఎక్కడో మానవతా దృక్పథం లోపించినట్లుగా ఉంద’న్నారు. ‘ఘటనలో బాధిత కుటుంబాన్ని అల్లుఅర్జున్ పరామర్శించకపోవటం తప్పే’ అని పవన్ అంగీకరించారు. ‘థియేటర్ కు వెళ్ళదలచుకున్న అల్లుఅర్జున్ ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చుండాల్సింద’ని అభిప్రాయపడ్డారు. ‘పోలీసులు వద్దన్నా సినిమా యూనిట్ థియేటర్ కు వెళ్ళటం తప్పే’ అన్న అర్ధమొచ్చేట్లుగా పరోక్షంగా చెప్పారు. అల్లుఅర్జున్ అరెస్టు విషయాన్ని మీడియా ప్రస్తావించగా ‘దటీజ్ రేవంత్ రెడ్డి’ అని అభినందించించారు. ‘రేవంత్ వెరీ టఫ్ లీడర్..బాగా పనిచేస్తున్నారు’ అని పవన్ కితాబిచ్చారు.

ఒకవైపు తాము రేవంత్ ను టార్గెట్ చేస్తు పదేపదే ఆరపణలు, విమర్శలు చేస్తుంటే మరోవైపు రేవంత్ బాగా పనిచేస్తున్నాడని అభినందిస్తు, తొక్కిసలాట ఘటనలో అల్లుఅర్జున్ దే తప్పని అర్ధమొచ్చేట్లుగా వ్యాఖ్యలు చేయటంపై బండి సంజయ్ మండిపోయారు. రేవంత్ టఫ్ లీడర్ అన్న పవన్ కు ఏ కోణంలో రేవంత్ టఫ్ గా కనిపించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి మూటలు మోస్తు ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్న రేవంత్ ను బాగా పనిచేస్తున్నాడని కితాబివ్వటం ఏమటని పవన్ను నిలదీశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనసేన అధినేత హోదాలో పవన్ ఎన్డీయేలో పార్టనర్ అన్న విషయం అందరికీ తెలుసు. ఎన్డీయేలో బీజేపీ, జనసేన ఇద్దరూ భాగస్వాములే. రేవంత్ ను బీజేపీ టార్గెట్ చేస్తుంటే పవన్ కితాబివ్వటం బండికి ఏమాత్రం నచ్చలేదు. ఇదేసమయంలో అల్లుఅర్జున్ కు పవన్ స్వయాన బాబాయ్ అన్న విషయం కూడా తెలిసిందే. అల్లుఅర్జున్ కు మద్దతిస్తు రేవంత్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఎక్కడ మాట్లాడినా స్వయాన బాబాయ్ పవనే తొక్కిసలాటలో అల్లుఅర్జున్నే తప్పుపట్టారు కదాని ఎవరైనా ప్రశ్నిస్తే బీజేపీ నేతలు సమాధానం చెప్పలేరు. అందుకనే రేవంత్ కు కితాబిచ్చిన పవన్ పై ఇపుడు బండి మండిపోతున్నది.

Tags:    

Similar News