దుబాయిలో తప్పిపోయిన మా అబ్బాయిని వెతికిపట్టండి ప్లీజ్
ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన మా అబ్బాయి తప్పిపోయాడని, అతన్ని వెతికిపెట్టాలని కోరుతూ నూగురు రాహుల్ రాజ్ తల్లిదండ్రులు కుముదిని, గౌతంలు విన్నవించారు.
By : The Federal
Update: 2024-10-22 10:33 GMT
హైదరాబాద్ నగరంలోని గౌలిగూడకు చెందిన నూగురు రాహుల్ రాజ్ (32) అనే యువకుడు ఉద్యోగం కోసం విజిట్ వీసాపై దుబాయికి వెళ్లి జాడ తెలియకుండా పోయిన సంఘటన మంగళవారం జరిగిన ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో వెలుగుచూసింది.
- ఈ నెల 14వతేదీన దుబాయికి చేరుకున్న తమ కుమారుడు రాహుల్ రాజ్ బ్యాగును 19వతేదీన దొంగలు కొట్టేశారని అందులో ఉన్న డబ్బులు కూడా పోయాయని తమకు ఫోన్ లో చెప్పాడని అతని తల్లిండ్రులు కుముదిని, గౌతంలు చెప్పారు.
- ఆ తర్వాత అతని మొబైల్ స్విచ్చాఫ్ అయిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ మేరకు కుముదిని, గౌతంలు మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని 'ప్రవాసీ ప్రజావాణి' లో వినతి పత్రం సమర్పించారు.
సీఎంకు వినతి
తమ కుమారుడు రాహుల్ ను వెతికి పెట్టి ఇండియాకు వాపస్ తెప్పించాలని వారు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆచూకీ తెలిసినవారు +91 98487 49667 మొబైల్ నెంబర్ కు వాట్సాప్ చేయాలని వారు కోరారు. టీపీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, తెలంగాణ కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి బాధితుడి తల్లిదండ్రులకు తగిన సూచనలు చేసి దరఖాస్తు చేయించారు.