ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు..

ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్‌కు మళ్ళీ బీజేపీ కార్పొరేటర్ శంకుస్థాపన చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.;

Update: 2025-03-18 10:09 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఎల్బీనగర్ పోలీసులు. కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. క్రైమ్ నెంబర్ 254/2025 ఎస్సీ, ఎస్టీ యాక్ట్ 1989 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వివాదం ప్రోటోకాల్ దగ్గర మొదలైంది. మార్చి 12న మన్సూరాబాద్ డివిజన్‌లో సుధీర్ రెడ్డి పలు డెవలప్‌మెంట్ పనులకు శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన పనులను మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తిరిగి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే చేసిన తర్వాతే కార్పొరేటర్ కూడా శంకుస్థాపన చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్‌కు మళ్ళీ బీజేపీ కార్పొరేటర్ శంకుస్థాపన చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ెస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News