CV Anand | పోలీసులు ఎలా పనిచేయాలో చెప్పిన సీవీ ఆనంద్..

పోలీసు ఉద్యోగమంటే అనేక బరువు బాధ్యతలతో కూడుకున్న పని అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.

Update: 2024-11-21 07:14 GMT

పోలీసు ఉద్యోగమంటే అనేక బరువు బాధ్యతలతో కూడుకున్న పని అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CV Anand) చెప్పారు. పోలీసు(Police) ఉద్యోగమంటే ఒక టెస్ట్ క్రికెట్(Cricket) మ్యాచ్ లాంటిదని, ఎందులో మన నైపుణ్యం చాలా ముఖ్యమని ఆయన వివరించారు. తొమ్మిది నెలల పోలీసు శిక్షణ పూర్తి చేసుకున్న పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారాయన. 747 మంది పోలీసు కానిస్టేబుళ్ల పోలీస్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హైదరాబాద్ పోలీస్ శాఖకు 1,128 మందిని శిక్షణ కోసం కేటాయించామని, 3,081 మంది మహిళల కానిస్టేబుల్స్ శిక్షణ పొందారని చెప్పారాయన. పోలీసులు ఎప్పుడూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని, రాజ్యాంగ పరిధిని దాటకుండా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు.

మద్యానికి దూరంగా ఉండాలి..

‘‘నేను 1992లో ఐపీఎస్ శిక్షణ పొందాను. అప్పుడు నాతో పాటు మొత్తం 80 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. అప్పట్లో వర్షం పడుతున్నా సరే మేము పరేట్ చేశాం. ఇప్పుడు శిక్షణ పొందిన వారు పోలీసు శాఖలో 35ఏళ్లు గడపబోతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి విధేయత చూపాలి. పోలీసులు అంటే నిజాయితీగా, న్యాయంగా పనిచేయాలి. ప్రజల మాన ప్రాణాలు కాపాడటంలో ముందుండాలి. పోలీసు ఉద్యోగం అంటే సిమెంటు రోడ్డుపై ప్రయాణం కాదు. అనేక ఒడిదుడుకులతో సాగే ఘాట్ రోడ్డు ప్రయాణం లాంటిది. అదే విధంగా పోలీసులంతా కూడా మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అదే విధంగా ప్రతి పోలీసు అధికారి కూడా ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు.

నేను చాలా ఫిట్..

‘‘నేను చాలా ఫిట్‌గా ఉన్నాను. 30 ఏళ్ల క్రితం నా ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో వేసుకున్న యూనిఫామ్‌ను నేను ఇప్పటికీ వేసుకోగలను. ఫిట్‌గా ఉన్న వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. పోలీసుల జీతాలను ప్రభుత్వం పెద్దగా పెంచదు. అలాగని పోలీసులు అవినీతి మార్గంలో వెళ్లకూడదు. ఐపీఎష్ లాంటి ఉద్యోగంలో కూడా జీతాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పోలీసు శాఖలో కూడా జీతాలు మెల్లమెల్లగా పెరుగుతాయి’’ అని చెప్పారు.

Tags:    

Similar News