పౌరహక్కుల నేత మృతి పట్ల ప్రొఫెసర్ కంచ ఐలయ్య సంతాపం...
"బీడి కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పొరాటం మరవలేనిది."
పౌర హక్కుల ఉద్యమం లో పనిచేసిన గొర్రె పాటి మాధవరావ్ (67) అకస్మాత్తుగా మృతి చెందడం చాలా విచారకరమని ప్రముఖ బహుజన మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఫఫర్డ్ అన్నారు నాతో 1980- 90 లలో ఆయన తనతో కలసి పౌరహక్కుల ఉద్యమంలో కలసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఫ్రొఫెసర్ ఐలయ్య ప్రగాఢ సంతాపం తెలిపారు. పౌర హక్కుల సంఘం నాయకుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది అయిన గొర్రెపాటి మాధవరావు డిసెంబర్28, 2024న తెలంగాణలోని నిజామాబాదులో మరణించారు.
మాధవరావు కుటుంబ సభ్యులు, ఆయన కళ్ళను శరీరాన్ని, వైద్య విద్యార్థుల పరిశోధనల కు ఇచ్చినందుకు ఆ కుటుంబాన్ని అభినందిస్తున్నానని ప్రొ. ఐలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. "మాధవరావు చాలా సౌమ్యుడు, మానవత్వం కలిగిన వకీల్. ఆయన నిజామాబాదులో బీడీ కార్మికుల సంక్షేమం కోసం చేసిన సేవ చట్ట పర పోరాటం చాలా గొప్పది. ఆయనతో పౌర హక్కులలో పనిచేసిన కాలాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను," అని ప్రొ. ఐలయ్య పేర్కొన్నారున